PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/will-telangana-cm-kcr-changes-his-decision8bc2b2b0-fbb6-49d6-92d5-0fabcf0cc166-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/will-telangana-cm-kcr-changes-his-decision8bc2b2b0-fbb6-49d6-92d5-0fabcf0cc166-415x250-IndiaHerald.jpgరెవెన్యూ శాఖలో అవినీతికి వీఆర్వోలే కారణం అంటూ.. ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దుచేసి పడేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ రద్దు అమలులోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ వారికి ప్రత్యామ్నాయ విధులు కేటాయించలేదు. మరోవైపు రెవెన్యూలో కూడా వీఆర్వోల విధులను ఇతరులకు పూర్తి స్థాయిలో బదలాయించకపోవడంతో అక్కడ కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో వీఆర్వోల రద్దు విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. kcr;kcr;amala akkineni;dharani;jr ntr;telangana;application;lieవీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?kcr;kcr;amala akkineni;dharani;jr ntr;telangana;application;lieMon, 11 Jan 2021 11:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్. ఈ రద్దు అమలులోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ వారికి ప్రత్యామ్నాయ విధులు కేటాయించలేదు. మరోవైపు రెవెన్యూలో కూడా వీఆర్వోల విధులను ఇతరులకు పూర్తి స్థాయిలో బదలాయించకపోవడంతో అక్కడ కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో వీఆర్వోల రద్దు విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆన్ లైన్ పోర్టల్ ధరణి ఏర్పాటుతో వీఆర్వో వ్యవస్థ అవసరం లేదని అన్నారు సీఎం కేసీఆర్. అయితే ధరణి వ్యవహారం పూర్తిగా తలకిందులైంది. పోర్టల్ పనితీరుతో ప్రజలు ఇబ్బందులకు గురికావడంతో తిరిగి వీఆర్వోల సేవలనే కొన్ని చోట్ల వినియోగించుకుంటున్నారు. తహశీల్దారు కార్యాలయాల్లో వీఆర్వోలంతా పాత విధులనే అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భూ సంబంధిత కార్యకలాపాలు పెరగడంతో రెవెన్యూ డివిజన్లు, తహశీల్దార్ల కార్యాలయాల్లో వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్ల పరిధిలో పనిచేయాలంటూ వీఆర్వోలకు అంతర్గత ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల 9.80 లక్షల సాదాబైనామా దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిని పరిశీలించి, అర్హులను గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరు. దీంతో వీఆర్వోలను ఈ పనులకోసం వినియోగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, పరిరక్షణ విధులు కూడా వారికి కేటాయిస్తున్నారు. వీఆర్వోలను తీసేశారు కదా, తిరిగి వారే ఈ విధులకు వస్తున్నారేంటి అనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 590 తహశీల్దారు కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో వీఆర్వోలను తిరిగి అదే పోస్టుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే సర్దుబాటు చేయాలని, ఆ దిశగా సీఎం నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తమకు ఉందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తెలిపారు. తప్పు చేసే అధికారాలేవీ తమకు లేవని, కానీ వ్యవస్థాగతమైన తప్పులకు వీఆర్వోలను బలిచేశారని ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జూనియర్ అసిస్టెంట్ లు గా తిరిగి రెవెన్యూ శాఖలోకే తీసుకోవాలని కోరారు. 


టాలీవుడ్ హీరోయిన్ల‌కే కాదు.. హీరోల‌కు కాస్టింగ్ కౌచ్ బాధ‌లా...?

త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

డబ్బే డబ్బు : క్రిడిట్ స్కోర్ లేకపోయినా ఇలా చేస్తే చాలు రుణాలు వస్తాయి !

భారత్ కోసం మరో దేశం సిద్ధమైంది.. చైనా కు ఊహించని షాక్..?

బాగా ఎమోషనల్ ఐనా ... అల్లుడు శ్రీను...!?

మరో షాక్...నిమ్మగడ్డ ఇప్పట్లో రిటైర్ కారా.....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>