PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdpb052462a-6b02-4d3f-b9dd-c17e1f671220-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు సీరియస్ గా పనిచేయడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు నియోజకవర్గాలకు కూడా రాకుండా హైదరాబాదులో బెంగళూరులో అదేవిధంగా చెన్నైలో ఎక్కువగా ఉంటున్నారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా నియోజకవర్గానికి రాక పోవడంతో కార్యకర్తలలో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గ పరిధిలో ఆశించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు పనిచేయటం లేదు అనే భావన ఉంది. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు నియోజకవర్గtdp, ap;cbn;bhavana;hyderabad;telugu desam party;andhra pradesh;telugu;media;parliment;bengaluru 1;tdp;local language;partyటీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లుటీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లుtdp, ap;cbn;bhavana;hyderabad;telugu desam party;andhra pradesh;telugu;media;parliment;bengaluru 1;tdp;local language;partyMon, 11 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు సీరియస్ గా పనిచేయడం లేదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు నియోజకవర్గాలకు  కూడా రాకుండా హైదరాబాదులో బెంగళూరులో అదేవిధంగా చెన్నైలో ఎక్కువగా ఉంటున్నారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు కూడా నియోజకవర్గానికి రాక పోవడంతో కార్యకర్తలలో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గ పరిధిలో ఆశించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు పనిచేయటం లేదు అనే భావన ఉంది.  ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేయాల్సి ఉంటుంది.

అంతే కాకుండా నిరసన కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేయాల్సి ఉన్న సరే కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇప్పుడు నియోజకవర్గాలకు రావడం లేదు. ఇక పార్లమెంట్ కమిటీలను చంద్రబాబునాయుడు వేసారు. ఈ పార్లమెంట్ కమిటీ లో ఉన్న సీనియర్ నేతలు కూడా ఇప్పుడు బయటకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తున్న అంశం గా చెప్పాలి. నియోజకవర్గాలకు రాకుండా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ లో ఉంటున్నారు అని అంటున్నారు. దీని కారణంగా పార్టీ ప్రజల్లోకి వెళ్లడం లేదు అనే భావన కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా కూడా వాడకుండా వ్యాపారాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని  అంటున్నారు.

ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తే స్థానిక నేతలతో మాట్లాడటం మినహా ఏమీ చేయడం లేదని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు అనేది క్రమంగా కోల్పోతుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. చాలామంది నాయకులు నియోజకవర్గాలకు రాకపోవడంతో కార్యకర్తలు కూడా ఇప్పుడు నియోజకవర్గాల్లో తిరగాడనికి  ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాలకు కూడా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి నియోజకవర్గాల్లో కార్యకర్తలకు సహకారం లేదు.


ఎన్ని క్రీమ్స్ వాడిన ముఖంపై మచ్చలు తగ్గడం లేదా?

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?

వామ్మో.. క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర వ‌ర‌ల్డ్ రికార్డు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>