PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nimmagadda-jagan63fbd2ff-9769-4a0e-8a6f-298f4dd4e99f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/nimmagadda-jagan63fbd2ff-9769-4a0e-8a6f-298f4dd4e99f-415x250-IndiaHerald.jpgఎన్నిక‌లు నాలుగు ద‌శ‌ల్లో నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌, వ్యాక్సిన్ సాకుగా చూపిస్తూ ప్ర‌భుత్వం మాత్రం ఏదోలా ఎన్నిక‌లు వాయిదా వేయించేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ యుద్ధం ఇలా న‌డుస్తుండ‌గానే తాజాగా సీఎం జ‌గ‌న్ నిమ్మ‌గ‌డ్డ‌ను టార్గెట్‌గా చేసుకుని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నెల్లూరు జిల్లాలో అమ్మ ఒడి కార్య‌క్ర‌మం ప్రారంభించిన జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షాల క‌డుపు మంట ఎలా ఉందో అంద‌రికి తెలుస‌ని విమ‌ర్శించారు. క్ష‌ద్ర‌పూజ‌లు చేసిన వాళ్లు ఇప్పుడు nimmagadda jagan;kumaar;war;letter;reddyనిమ్మ‌గ‌డ్డ కోవ‌ర్ట్... సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన జ‌గ‌న్నిమ్మ‌గ‌డ్డ కోవ‌ర్ట్... సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన జ‌గ‌న్nimmagadda jagan;kumaar;war;letter;reddyMon, 11 Jan 2021 15:30:20 GMTఏపీలో ప్ర‌స్తుతం ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వ‌ర్సెస్ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఏ స్థాయిలో వార్ న‌డుస్తుందో ?  ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ మాత్రం నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌ కుమార్ ప‌ద‌వీ కాలం ముగిసేంత వ‌ర‌కు ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌ప‌కూడ‌ద‌న్న ఉద్దేశంలో ఉన్నారు. ఇక జ‌గ‌న్ ప‌ద‌వి నుంచి దింపేసినా కోర్టు ద్వారా తిరిగి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి వ‌చ్చిన నిమ్మ‌గ‌డ్డ మాత్రం త‌న ప‌ద‌వీ కాలంలోనే ఎన్నికలు పూర్తి చేయాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీంతో ఈ ఇద్ద‌రిలో ఎవ‌రిది పై చేయి అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

ఇక తాజాగా నిమ్మ‌గ‌డ్డ పంచాయ‌తీ ఎన్నిక‌లు నాలుగు ద‌శ‌ల్లో నిర్వ‌హించాల‌ని ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా.. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌, వ్యాక్సిన్ సాకుగా చూపిస్తూ ప్ర‌భుత్వం మాత్రం ఏదోలా ఎన్నిక‌లు వాయిదా వేయించేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ యుద్ధం ఇలా న‌డుస్తుండ‌గానే తాజాగా సీఎం జ‌గ‌న్ నిమ్మ‌గ‌డ్డ‌ను టార్గెట్‌గా చేసుకుని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నెల్లూరు జిల్లాలో అమ్మ ఒడి కార్య‌క్ర‌మం ప్రారంభించిన జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షాల క‌డుపు మంట ఎలా ఉందో అంద‌రికి తెలుస‌ని విమ‌ర్శించారు.

క్ష‌ద్ర‌పూజ‌లు చేసిన వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారంటూ చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డంతో పాటు అటు బీజేపీని ర‌థ‌యాత్ర‌లు చేస్తామ‌ని చెప్ప‌డంపై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీపై ఇప్ప‌టి వ‌ర‌కు సుతిమెత్త‌ని విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్ ఇక‌పై ఏ మాత్రం త‌గ్గ‌న‌ని త‌న వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల బాధ‌లు, ప్రాణాలు ప‌ట్టించుకోని చంద్రబాబు కోవర్టులు ఎన్నికల షెడ్యూల్ ఎలా విడుదల చేస్తున్నారో అందరికీ తెలుసునన్నారు.

ఓ వైపు సంక్షేమ ప‌థ‌కాలు కూడా ఆపేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నారంటూ జ‌గ‌న్ మండిప‌డ్డారు. గుళ్లు అయిపోయాయి.. ఇక బ‌డులే మిగిలాయి.. వాటిపై ప‌డ‌తార‌ని ఎద్దేవా చేశారు. ఏదేమైనా నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో జ‌గ‌న్ తెగించేసి ఉన్నార‌ని.. తాడో పేడో తేల్చుకునేందుకు కూడా వెనుకాడ‌డం లేద‌ని ఆయ‌న మాట‌లే చెప్పేస్తున్నాయి. 


బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>