PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-with-bird-flu-tensionc6c78eb9-040c-4e8f-ab95-f7b3b3bd3191-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-with-bird-flu-tensionc6c78eb9-040c-4e8f-ab95-f7b3b3bd3191-415x250-IndiaHerald.jpgబర్డ్‌ ఫ్లూ వైరస్‌ విస్తరిస్తోంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పాకుతోంది. ఇప్పటికే కరోనాతో భయపడిపోతున్న జనానికి బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. వైరస్‌ భయంతో మాంసం కొనేందుకు కూడా ముందుకు రావడం లేదు. మరోవైపు ఐదు రాష్ట్రాలకే పరిమితమైందనుకున్న బర్డ్‌ ఫ్లూ.. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలకు పాకింది. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా.. వైరస్‌ టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. ఏవియన్‌ ఫ్లూ వైరస్‌తో చనిపోతున్న పక్షుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపtension with bird flu tension;kerala;mumbai;delhi;chhattisgarh;central governmentబర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!బర్డ్ ఫ్లూతో టెన్షన్ టెన్షన్..!tension with bird flu tension;kerala;mumbai;delhi;chhattisgarh;central governmentMon, 11 Jan 2021 17:30:48 GMT
బర్డ్‌ ఫ్లూ వైరస్‌ విస్తరిస్తోంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పాకుతోంది. ఇప్పటికే కరోనాతో భయపడిపోతున్న జనానికి బర్డ్‌ఫ్లూ భయం పట్టుకుంది. వైరస్‌ భయంతో మాంసం కొనేందుకు కూడా ముందుకు రావడం లేదు. మరోవైపు ఐదు రాష్ట్రాలకే పరిమితమైందనుకున్న బర్డ్‌ ఫ్లూ.. ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలకు పాకింది. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా.. వైరస్‌ టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. ఏవియన్‌ ఫ్లూ వైరస్‌తో చనిపోతున్న పక్షుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లలోనూ ఏవియన్‌ ఫ్లూ వైరస్‌ బయటపడింది.


బర్డ్‌ఫ్లూ బాధిత రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ కూడా ఈ బాధిత రాష్ట్రాల జాబితాలో చేరింది. దీంతో దేశంలో ఈ వ్యాధి విజృంభిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరింది. కేరళ, రాజస్థాన్‌,  మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ ఇప్పటికే బర్డ్‌ఫ్లూ జాబితాలో చేరాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్‌లో దాదాపు 900 కోళ్లు చనిపోయాయి.  ముంబై, థానె, దాపోలి జిల్లాల్లోనూ కాకులు మృత్యువాత పడ్డట్లు గుర్తించారు.

గత మూడు రోజులు సౌత్‌ ఢిల్లీలోని డిస్ట్రిక్ట్‌ పార్క్‌లో 24 కాకులు చనిపోయాయి. సంజయ్‌ సరస్సులో 10 బాతులు కూడా మృత్యువాత పడ్డాయి. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. మూడు పార్క్‌లను మూసివేశారు. పక్షులు చనిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఢిల్లీలోని అతిపెద్ద చికెన్‌ మార్కెట్‌ ఘాజిపూర్‌ను పది రోజుల పాటు మూసివేశారు. అంతేకాదు.. బతికి ఉన్న పక్షుల దిగుమతిపై నిషేధం విధించారు అధికారులు. అకస్మాత్తుగా చనిపోయిన పక్షుల శాంపిల్స్‌ను అధికారులు పరీక్షలకు పంపించారు. 


కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?

నిమ్మ‌గ‌డ్డ కోవ‌ర్ట్... సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన జ‌గ‌న్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>