PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddyd38990b7-ec86-4bcc-89af-1891ad5f394c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddyd38990b7-ec86-4bcc-89af-1891ad5f394c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ పార్టీ యువనేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తమ కృషిని గుర్తించడంలేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి రాష్ట్ర రాజకీయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. komatireddy rajagopal;nagarjuna akkineni;hyderabad;komati;komatireddy rajgopal reddy;telangana;congress;telugu;huzur nagar;tpcc;hayathnagar;reddy;partyకాంగ్రెస్ అధిష్టానం మా కష్టాన్ని గుర్తించట్లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్కాంగ్రెస్ అధిష్టానం మా కష్టాన్ని గుర్తించట్లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్komatireddy rajagopal;nagarjuna akkineni;hyderabad;komati;komatireddy rajgopal reddy;telangana;congress;telugu;huzur nagar;tpcc;hayathnagar;reddy;partyMon, 11 Jan 2021 18:30:00 GMTతెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ పార్టీ యువనేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అధిష్టాన వైఖరిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఇటీవలే టీపీసీసీ చీఫ్ ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలని కొందరు నాయకులు హైకమాండ్‌కు సూచించారు. ఇప్పటికిప్పుడు టీపీసీసీ చీఫ్ ని ప్రకటిస్తే అసంతృప్తి జ్వాలలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసింది. అయితే ఈ విషయమై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.




హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఓ కార్యక్రమానికి వచ్చిన కోమటి రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్భవించిన అప్పటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని ఆరోపించారు కోమటిరెడ్డి. డిపాజిట్లు కూడా రానీ నేతలు, తెలంగాణాలో పంపిస్తే కాంగ్రెస్ ఎలా బలపడుతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. సాగర ఉప ఎన్నికకు పీసీసీ ఎంపికతో ముడి పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అధిష్టానం సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేదని ఇట్టే అర్థం అవుతోందన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం తమ కృషిని గుర్తించడంలేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి రాష్ట్ర రాజకీయాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందనీ, అభిమానులు ఎవరూ బాధపడొద్దని రాజగోపాల్ రెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీకోసం కష్టపడే వారిని అధిష్టానం గుర్తించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. ఇప్పటికే ఒకసారి తను బీజేపీలోకి వెళ్తానంటూ ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపారు. ఇప్పుడు మరోసారి అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి.




బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ రీ ఎంట్రీ అదుర్స్...!

ప్రజల మంచికోసమే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారట..?

దేశాన్ని కాపాడేందుకు భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ !

జగన్ కు బిగ్ షాక్..అక్రమాస్తుల కేసులో కోర్ట్ కీలక నిర్ణయం !!

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>