PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-minister419a660d-10e0-4b3d-b323-18a4292555ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/central-minister419a660d-10e0-4b3d-b323-18a4292555ab-415x250-IndiaHerald.jpgకేంద్ర ఆయుష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయ‌క్‌ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మంత్రి భార్య విజయ మరణించింది. క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో ఎల్లాపుర నుంచి గోక‌ర్ణ‌కు వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అంకోలా తాలూకా హోసాకంబీ గ్రామం వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డడంతో ప్రమాదం సంభవించింది​.central minister;goa;narendra modi;police;car;minister;wife;central governmentరోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి తీవ్ర గాయాలు.. భార్య మృతిరోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి తీవ్ర గాయాలు.. భార్య మృతిcentral minister;goa;narendra modi;police;car;minister;wife;central governmentMon, 11 Jan 2021 23:46:44 GMTకేంద్ర ఆయుష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయ‌క్‌ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో  మంత్రి భార్య విజయ మరణించింది. క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలో ఎల్లాపుర నుంచి గోక‌ర్ణ‌కు వెళుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అంకోలా తాలూకా హోసాకంబీ గ్రామం వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డడంతో ప్రమాదం సంభవించింది. కేంద్ర మంత్రి శ్రీ‌పాద్‌ నాయ‌క్‌, ఆయ‌న భార్య విజ‌య‌, వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి దీప‌క్ దూబే, మ‌రొక‌రు తీవ్రంగా గాయ ప‌డ్డారు. విజ‌య త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది. కాగా, వారిని చికిత్స కోసం స‌మీప ప్ర‌భుత్వ‌ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా ఆయ‌న భార్య విజ‌య‌‌, వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి దీప‌క్ మ‌ర‌ణించార‌ని పోలీసులు ధ్రువీక‌రించారు.

   శ్రీ‌పాద్ నాయక్‌, త‌న భార్య పిల్ల‌ల‌తో క‌లిసి యెల్లాపూర్‌లోని గంటే గ‌ణ‌ప‌తి దేవాల‌యాన్ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. తిరిగి గోక‌ర్ణ‌కు రాత్రి ఏడు గంట‌ల‌కు బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్యలో ఎన్‌హెచ్‌-63 నుంచి స‌బ్ రోడ్డు.. గోక‌ర్ణ‌కు అడ్డ‌దారికి వారు ప్ర‌యాణిస్తున్న ఎస్‌యూవీ కారును మ‌ళ్లించారు. ఈరోడ్డు ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దీంతో కారు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. అంకోలా పోలీసులు కేసు న‌మోదు చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయ‌క్‌కు ప్రాథ‌మిక చికిత్స త‌ర్వాత మెరుగైన వైద్య సేవ‌ల కోసం గోవాకు త‌ర‌లించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలుస్తున్న‌ది.

                    కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయ‌క్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. నాయ‌క్ చికిత్స కోసం త‌గు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్ర‌మాదం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. శ్రీ‌పాద్ నాయ‌క్ త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అవ‌స‌ర‌మైతే శ్రీ‌పాద్ నాయ‌క్‌ను త‌రలించ‌డానికి ప్ర‌త్యేక ఎయిర్ అంబులెన్స్ ను అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పారు.




అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>