PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan6c5f4ff7-3bd8-4590-98b9-919e5b56191c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan6c5f4ff7-3bd8-4590-98b9-919e5b56191c-415x250-IndiaHerald.jpgముందు సైలెంట్‌గా ఉన్న మ‌రో మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి చివ‌ర‌కు అనిల్‌కు ధీటుగా రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా అమ్మ ఒడి పథకం రెండో విడ‌త ప‌థ‌కం ప్రారంభోత్స‌వం కోసం నెల్లూరు జిల్లాలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ సాక్షిగా వైసీపీలో గ్రూపుల గోల‌కు సాక్షిగా నిలిచింది. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని నిర్ణ‌యించుకున్న నేత‌లు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు అనిల్‌, మేక‌పాటి ఇద్ద‌రూ కూడా త‌మ స‌త్తా ఏంటో చూపించి.. జిల్లాలో త‌మ‌దే jagan;anil music;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;mp;district;backward classes;assembly;mla;minister;fort;letter;tdp;ycp;gautam adani;reddy;party;mantraజ‌గ‌న్ సాక్షిగా వైసీపీలో రెడ్డి వ‌ర్సెస్ బీసీ.. కులాల పంచాయితీ..?జ‌గ‌న్ సాక్షిగా వైసీపీలో రెడ్డి వ‌ర్సెస్ బీసీ.. కులాల పంచాయితీ..?jagan;anil music;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;mp;district;backward classes;assembly;mla;minister;fort;letter;tdp;ycp;gautam adani;reddy;party;mantraMon, 11 Jan 2021 10:15:00 GMTజిల్లా కూడా ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని ప‌ది అసెంబ్లీ సీట్ల‌తో పాటు నెల్లూరు ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డింది. అస‌లు ఈ జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌కు భారీ మెజార్టీలు వ‌చ్చాయి. ఈ మెజార్టీలు చూసి టీడీపీ వాళ్లు ఇక భ‌విష్య‌త్తులో కూడా జిల్లాలో రాజ‌కీయం చేయ‌లేం ? అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అలాంటి జిల్లాలో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేత‌ల కుమ్ములాట‌లు మామూలుగా లేవు. ఎవ్వ‌రూ ఎవ్వ‌రిని లెక్క చేయ‌డం లేదు.

కొద్ది రోజులుగా జిల్లాలో మంత్రి అనిల్ టార్గెట్‌గా రెడ్లు అంద‌రూ ఏక‌మై రాజ‌కీయాలు చేశారు. ముందు సైలెంట్‌గా ఉన్న మ‌రో మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి చివ‌ర‌కు అనిల్‌కు ధీటుగా రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా అమ్మ ఒడి పథకం రెండో విడ‌త ప‌థ‌కం ప్రారంభోత్స‌వం కోసం నెల్లూరు జిల్లాలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ స‌భ సాక్షిగా వైసీపీలో గ్రూపుల గోల‌కు సాక్షిగా నిలిచింది. జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని నిర్ణ‌యించుకున్న నేత‌లు ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు.

జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు అనిల్‌, మేక‌పాటి ఇద్ద‌రూ కూడా త‌మ స‌త్తా ఏంటో చూపించి.. జిల్లాలో త‌మ‌దే డామినేష‌న్ అని ఫ్రూవ్ చేసుకోవాల‌ని పంతానికి పోయారు. జ‌గ‌న్ స‌భ నిర్వ‌హ‌ణ అంతా మంత్రి అనిల్‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కంట్ర‌ల్లోనే ఉంది. అయితే మ‌రో మంత్రి మేక‌పాటితో పాటు రెడ్డి ఎమ్మెల్యేలు అంద‌రూ మ‌రో వ‌ర్గంగా ఏర్ప‌డి ఏ ఒక్క‌రు కూడా అనిల్ ఇంటి వైపు క‌న్నెత్తి చూడ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో మిగిలిన బీసి నేత‌లు.. జిల్లాలో కూడా రెడ్డి లీడ‌ర్ల డామినేషనే జ‌రుగుతోంద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ ప‌లు జిల్లాల్లో నేత‌ల కుమ్ములాట‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే ఇప్పుడు ఈ కొత్త కుమ్ములాట‌లు ఏంట్రా అని అధిష్టానం త‌ల ప‌ట్టుకుంటోంది. ఇక మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు అయిన కాకాణి, ఆనం మాత్రం అస‌లు ఇటు వైపే తొంగి చూడ‌డం లేదంటున్నారు.




చెన్నైలో దారుణం... స‌బ‌ర్బ‌న్ రైలులో మ‌హిళ‌పై సామూహిక‌ అత్యాచారం

భార్య చెప్పిన ఆ మాటతో.. కోమాలో నుంచి టక్కున లేచి కూర్చున్న భర్త

జగన్ పీకే మళ్ళీ కలిశారంటే...?

బండి దెబ్బ... కేసీఆర్ సంచలన నిర్ణయం

ఆ ఇండియన్ లేడీసు.. అదరగొట్టారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..!

గవర్నర్ కు వ్యతిరేకంగా సీఎం దీక్ష

తెలంగాణ ఉద్యోగులకు భారీ ప్యాకేజీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>