PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagan0664ba56-8d7c-42f1-9f74-8ecc5c956c43-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagan0664ba56-8d7c-42f1-9f74-8ecc5c956c43-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ ,ఏపీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ మధ్య వార్ సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెప్పా పెట్టకుండా కరోనా కారణంతో స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడంతో మొదలైన యుద్ధం.. దాదాపు ఏడాది అవుతున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత జగన్ నిమ్మగడ్డను ఆ పదవి నుంచి పరోక్షంగా పీకేయడం.. మరో జస్టిస్‌ కనకరాజ్‌ను తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టడం.. ఇంతలో నిమ్మగడ్డ కోర్టుకెక్కడం.. కోర్టు ఆదేశాలతో మళ్లీ పదవి చేపట్టడం అంతా సినీఫక్కీలో సాగిపోయాయి. తాజాగా నిమ్మగడ్డ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారnimmagadda-jagan;jagan;andhra pradesh;panchayati;court;war;local language;ammavodi;chief commissioner of electionsనిమ్మగడ్డ చెప్పినా డోంట్‌ కేర్‌.. దేనికైనా సిద్ధమంటున్న జగన్..!?నిమ్మగడ్డ చెప్పినా డోంట్‌ కేర్‌.. దేనికైనా సిద్ధమంటున్న జగన్..!?nimmagadda-jagan;jagan;andhra pradesh;panchayati;court;war;local language;ammavodi;chief commissioner of electionsMon, 11 Jan 2021 06:00:00 GMTఏపీ సీఎం జగన్ ,ఏపీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ మధ్య వార్ సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెప్పా పెట్టకుండా కరోనా కారణంతో స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడంతో మొదలైన యుద్ధం.. దాదాపు ఏడాది అవుతున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత జగన్ నిమ్మగడ్డను ఆ పదవి నుంచి పరోక్షంగా పీకేయడం.. మరో జస్టిస్‌ కనకరాజ్‌ను తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టడం.. ఇంతలో నిమ్మగడ్డ కోర్టుకెక్కడం.. కోర్టు ఆదేశాలతో మళ్లీ పదవి చేపట్టడం అంతా సినీఫక్కీలో సాగిపోయాయి.

తాజాగా నిమ్మగడ్డ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. మార్చిలో పదవి నుంచి దిగిపోయే లోపల ఎలాగైనా ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ పట్టుదలగా ఉన్నారు. నిమ్మగడ్డ ఉన్నంతవరకూ ఎన్నికలు పెట్టేది లేదని జగన్ కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. జగన్ కు కొవిడ్ పరిస్థితి అనుకూలంగా ఉంది. అయితే నోటిఫికేషన్ కారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే పట్టణాల్లో కోడ్ అమల్లో ఉండదు.. పల్లెల్లోనూ ఉంటుందని ఎస్‌ఈసీ క్లారిటీ ఇచ్చింది.

దాని ప్రకారం జగన్ అమ్మ ఒడి కార్యక్రమం కూడా నిర్వహించకూడదు. తల్లుల ఎకౌంట్లలో డబ్బు వేయకూడదు. కానీ జగన్ సర్కారు ఈ విషయంలో డోన్ట్ కేర్ అంటోంది. ఇవాళ అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులు జరపనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. నెల్లూరు లో కార్యక్రమంలో అమ్మఒడి రెండో విడత చెల్లింపులు సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. కంప్యూటర్ బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. మొత్తం 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అమ్మఒడి కింద నగదును తల్లుల ఖాతాలో సీఎం జగన్ జమ చేయబోతున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15,000 ఆర్ధిక సాయం చేస్తారు. 1 తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్ధులకు అమ్మఒడి పథకం  వర్తింపజేస్తున్నారు. మరింత మందికి ప్రయోజనం కలిగేలా పలు నిబంధనలు సడలించినట్లు ప్రభుత్వం తెలిపింది. అంటే కోడ్ గీడ్ జాన్‌తా నై అని జగన్ నిమ్మగడ్డకు చెప్పకనే చెప్పినట్టేగా..మరి నిమ్మగడ్డ ఏం చేస్తారో..?




జ‌న‌వ‌రి 11వ తేదీ ప్రాధాన్యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>