PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu0162c4fd-9096-490f-9435-5063fd794700-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababu0162c4fd-9096-490f-9435-5063fd794700-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో జగన్ ఎలాంటి పరిపాలన కొనసాగిస్తున్నాడో అందరికి తెలిసిందే. ప్రజలకు చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ వారిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇళ్ల పంపిణీ దగ్గరినుంచి అమ్మవడి దాకా ప్రతి పథకంలో తన మార్క్ ఉండేలా చూసుకుంటూనే వారికి ఆ పథకాలు ఏవిధంగా అందుతున్నాయి సకాలంలో, సక్రమంగా అందుతున్నాయా అన్నది చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ కి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వాలంటీర్లు చాల బాగా పనిచేస్తున్నారు. chandrababu;jagan;mandula;tdp;partyవాలంటీర్లే చంద్రబాబు కొంప ముంచుతున్నారా..?వాలంటీర్లే చంద్రబాబు కొంప ముంచుతున్నారా..?chandrababu;jagan;mandula;tdp;partyMon, 11 Jan 2021 20:00:00 GMTజగన్ ఎలాంటి పరిపాలన కొనసాగిస్తున్నాడో అందరికి తెలిసిందే. ప్రజలకు చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ వారిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇళ్ల పంపిణీ దగ్గరినుంచి అమ్మవడి దాకా ప్రతి పథకంలో తన మార్క్ ఉండేలా చూసుకుంటూనే వారికి ఆ పథకాలు ఏవిధంగా అందుతున్నాయి సకాలంలో, సక్రమంగా అందుతున్నాయా అన్నది చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ కి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న వాలంటీర్లు చాల బాగా పనిచేస్తున్నారు.

వీరు వచ్చిన తర్వాత పాలనలో ఎంతటి మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజా ప్రాణితులకు పెద్ద గా పనికూడా లేదు. వీరే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. అయితే వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అనుకున్నట్లే వారే చంద్రబాబు పార్టీ ని తోక్కేస్తున్నారు.. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వారు టీడీపీ ప్రయోజనాలను లాగేసుకుంటున్నారు.. పథకాలు, ప్రభుత్వ సేవలే కాదు.. కరోనా విపత్త సమయంలోనూ వలంటీర్లు అందించిన సేవలు అమోఘమైనవి. కరోనా నియంత్రణలో వలంటీర్లదే కీలక పాత్ర. బాధితులను గుర్తించడం, దేశ, విదేశాల నుంచి వచ్చే వారి సమాచారం సేకరించడం, ఇళ్లలోనే చికిత్స తీసుకునే వారికి మందులు సరఫరా చేయడం.. ఇలా ప్రతి పనిలో వలంటీర్లను ప్రభుత్వం భాగస్వాములను చేసింది, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలోనూ వారి సేవలే కీలకం కానున్నాయి.

వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం కూడా ఎన్నికల మాదిరిగానే చేపట్టాల్సి ఉందని ప్రభుత్వం ఇప్పటికే ఓ అంచానకు వచ్చింది. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్న తరుణంలో.. ఆయా వర్గాల వారిని గుర్తించి, వారికి స్లిప్పులు పంపిణీ చేసే బాధ్యతలు వలంటీర్లే నిర్వర్తించాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఓటర్‌ స్లిప్పులను బూత్‌ లెవెల్‌ ఆఫీషర్‌ (బీఎల్‌వో) ఓటర్లకు పంపిణీ చేసేవారు. ఆ ప్రక్రియను వారు సమర్థవంతంగా నిర్వహించలేరని గత ఎన్నికలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీల కార్యకర్తలే ఆ పని చేసేవారు. ఈ క్రమంలో ప్రలోభాలు జరిగేవి. ఈ సారి ఆ అవకాశం లేకుండా.. ఓటర్లకు స్లిప్పులు పంపిణీ వలంటీర్ల ద్వారానే జరగే అవకాశం ఉంది. ఫలితంగా ఓటర్లకు స్లిప్పులు అందడంతోపాటు.. వారిని ప్రలోభ పెట్టే అవకాశం అభ్యర్థులకు దక్కబోదు.


సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>