PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-strong-counter-to-tdp2a19ec7f-55a9-4a69-821a-bc8e414651cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-strong-counter-to-tdp2a19ec7f-55a9-4a69-821a-bc8e414651cb-415x250-IndiaHerald.jpgచంద్ర‌బాబు శిష్యుడిగానే మంత్రి కొడాలి నాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది చంద్ర‌బాబును తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు. ఇక ఇప్పుడు ఇదే వ‌రుస‌లోకి మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వ‌చ్చి చేరిపోయారు. ఈ రోజు ఏపి శాసనమండలి వైసీపీఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్ ధాఖలు చేశారు. సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల‌తోనే నామినేష‌న్ వేశాన‌ని చెప్పిన ఆమె సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అంద‌జేయాల‌ని జ‌గ‌న్ ఎంతో తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని ప్ర‌శంసించారు. ఇక జ‌గ‌న్ అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాల‌ను అడ్డుకునేందుకేchandra babu;nani;deva;kodali nani;vamsi;jagan;pothula suneetha;andhra pradesh;geum;y. s. rajasekhara reddy;రాజీనామా;court;minister;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;party;sasanamandaliచంద్ర‌బాబు 20 ఏళ్లు న‌ర‌కం చూపించారు... మ‌హిళా నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచంద్ర‌బాబు 20 ఏళ్లు న‌ర‌కం చూపించారు... మ‌హిళా నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లుchandra babu;nani;deva;kodali nani;vamsi;jagan;pothula suneetha;andhra pradesh;geum;y. s. rajasekhara reddy;రాజీనామా;court;minister;letter;tdp;local language;ycp;lokesh kanagaraj;party;sasanamandaliMon, 11 Jan 2021 15:51:11 GMTవైఎస్సార్ సీపీ , విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు మామూలుగా పేల‌డం లేదు. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, స‌వాళ్ల ప‌ర్వంలో ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. దీనికి తోడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వాయిదాలు, హిందూ ఆల‌యాల్లో విగ్ర‌హాల విధ్వంసాలు.. చంద్ర‌బాబు, లోకేష్ ప‌ర్య‌ట‌న‌లు.. వీటిపై వైసీపీ ఎటాక్‌లు లాంటి సంఘ‌ట‌న‌ల‌తో ఏపీలో రాజ‌కీయం మామూలుగా వేడెక్క‌డం లేదు. ఇక రాజ‌కీయ విమ‌ర్శ‌లు కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. దీనికి తోడు గ‌త ఐదేళ్ల టీడీపీ ప్ర‌భుత్వంలో ఆ పార్టీలో ఉన్న వాళ్లు.. అక్క‌డ ప‌ద‌వులు అనుభ‌వించి ఇప్పుడు వైసీపీలో కి వెళుతున్నారు.

ఇక జ‌గ‌న్ , వైసీపీ నేత‌లు సైతం నాడు చంద్ర‌బాబు చెంత ఉన్న వాళ్ల‌తోనే ఇప్పుడు చంద్ర‌బాబును తిట్టిస్తున్నారు. వంశీ నుంచి మొద‌లు పెడితే క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్ అంత‌కు ముందే చంద్ర‌బాబు శిష్యుడిగానే మంత్రి కొడాలి నాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది చంద్ర‌బాబును తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నారు. ఇక ఇప్పుడు ఇదే వ‌రుస‌లోకి మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వ‌చ్చి చేరిపోయారు. ఈ రోజు ఏపి శాసనమండలి వైసీపీఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్ ధాఖలు చేశారు.

సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల‌తోనే నామినేష‌న్ వేశాన‌ని చెప్పిన ఆమె సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అంద‌జేయాల‌ని జ‌గ‌న్ ఎంతో తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ని ప్ర‌శంసించారు. ఇక జ‌గ‌న్ అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాల‌ను అడ్డుకునేందుకే చంద్ర‌బాబు కోర్టుల‌ను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నారంటూ మండిప‌డ్డారు. చివ‌ర‌కు దేవుడిని కూడా చంద్రబాబు వ‌ద‌ల‌కుండా.. ఆయ‌న్న కూడా రాజ‌కీయాల‌కు వాడుకుంటున్నారంటూ విమ‌ర్శించారు.

చంద్ర‌బాబు చిల్ల‌ర రాజ‌కీయాల‌తో కుతంత్రాలు చేస్తున్నార‌న్న సునీత‌... 20 ఏళ్లు టిడిపిలో పని చేశా ఆ సమయంలో చంద్రబాబు నరకం చూపించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మూడు నెలలకు సిఎం జగన్ నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రకటించారని ఆమె గ‌ర్వంగా చెప్పుకున్నారు. ఇక టీడీపీకి రాజీనామా చేసిన సునీత‌.. ఆ పార్టీ ద్వారా వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా వ‌దులుకున్నారు. ఇక ఈ ఉప ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ జ‌గ‌న్ ఆమెనే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.




లక్ష మంది జనాభా గల ఆ ద్వీప దేశాన్ని కూడా వదలని కరోనా....

కేటిఆర్ కేక... మరో భారీ కంపెనీ

నిమ్మగడ్డకి బిగ్ షాక్.. ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్ట్

సోము స్పీడ్ పెంచేశారు... టీడీపీకి ఇబ్బందే

"డ్రా" గా ముగిసిన మూడవ టెస్ట్..విహారి అద్బుత పోరాటం ..!!

18 ఏళ్ల తర్వాత టీమిండియా అరుదైన రికార్డు.. సత్తా చాటిన బ్యాట్స్మెన్లు..?

భూమా కుటుంబం నుంచి షార్ప్ షూట‌ర్.. రాజ‌కీయ అరంగేట్రానికి రెడీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>