MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-daughter-anshu34dd41fa-1c73-4d84-9553-f04bdc304155-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-daughter-anshu34dd41fa-1c73-4d84-9553-f04bdc304155-415x250-IndiaHerald.jpgఆర్. కే రోజా సెల్వమణి కి అన్షు మల్లికా, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజా సినిమాల్లో అగ్రతారగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆమె పట్టిందల్లా బంగారమే అని చాలామంది అంటుంటారు.roja daughter anshu;anshu;krishna;mallika;roja selvamani;india;roja;google;heroine;application;fidaaహీరోయిన్ అవుతుందనుకున్న రోజా కూతురు ఎవరు ఊహించని రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందిహీరోయిన్ అవుతుందనుకున్న రోజా కూతురు ఎవరు ఊహించని రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందిroja daughter anshu;anshu;krishna;mallika;roja selvamani;india;roja;google;heroine;application;fidaaMon, 11 Jan 2021 11:00:00 GMTరోజా సెల్వమణి కి అన్షు మల్లికా, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజా సినిమాల్లో అగ్రతారగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆమె పట్టిందల్లా బంగారమే అని చాలామంది అంటుంటారు. అయితే రోజా గారాలపట్టి అన్షుమల్లికా కూడా తనకు ఇష్టమైన రంగంలో అడుగుపెట్టి విజయం సాధిస్తోంది. ఆమెకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకీ రోజా ముద్దుబిడ్డ అన్షు మల్లికా అడుగుపెట్టిన రంగం ఏమిటంటే.. సాహిత్యం. సాధారణంగా సాహిత్యంలో ప్రావీణ్యం పొందాలంటే పుట్టుకతోనే ఏదో ఒక భాష పై చాలా పట్టు ఉండాలి. అలాగే క్రియేటివిటీ పుష్కలంగా ఉండాలి. ఆత్మశోధన చేసుకొనే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఒకరు రాసే సాహిత్యాన్ని ఇతరులు ఆస్వాదించగలుగుతున్నారు.

రోజా కుమార్తె అన్షుమల్లికా తన చిన్న వయసులోనే ఏకంగా ఒక పుస్తకం రాసి.. ఎంతో మంది రీడర్స్ ని ఆశ్చర్యపరిచింది. షిఫ్టింగ్ పర్సిప్షన్స్ పేరిట ఆమె ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. గూగుల్ ప్లే బుక్స్ అప్లికేషన్ లో ఈ-బుక్ సెక్షన్ లో "షిఫ్టింగ్ పర్సిప్షన్స్ బై మల్లికా రోజా సెల్వమణి" అని శోధిస్తే అన్షుమల్లికా యొక్క పీస్ ఆఫ్ రైటింగ్ మనం చదువుకోవచ్చు. ఈ పుస్తకంలో వేర్వేరు ప్రదేశాలనుంచి ప్రముఖ రచయితలు విభిన్నమైన అంశాలపై తమ ఆలోచనలను వెల్లడించారు. ఈ పుస్తకంలో ఉత్తమమైన ఆలోచనలను అన్షు మల్లిక కంపైల్ చేసి పాఠకులకు అందించింది.

ఈ పుస్తకం రాయకముందే అన్షు మల్లిక వివేకానంద యూత్ పార్లమెంటరీ నుంచి ఇన్నోవేటివ్ రైటర్ అవార్డు కూడా అందుకుంది. హృదయాన్ని హత్తుకునే విధంగా ఆమె తన భావాలను అక్షరరూపంలో తెలియజేయగలదు. ఆర్ కే రోజా తన కూతురిని ప్రోత్సహిస్తే ఆమె భారతదేశంలో ప్రముఖ రచయితలలో ఒకరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాఠకులు చెబుతున్నారు. రోజా కుమార్తె సరస్వతీ పుత్రిక లాగా చిన్నప్పుడే సాహిత్యంలో పట్టు సాధించడం తో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.


బొత్సతో జగన్ అందుకే మాట్లాడట్లేదా...?

రాజకీయాలపై రజినీ మనసు మార్చుకున్నారా..?

అదిరిపోయే ఆఫర్.. రీఛార్జ్ చేయండి.. కార్ ఇంటికి తీసుకెళ్లండి..?

Shocking News: ఇక సినిమాలు చేయడం నాకు ఇష్టంలేదు: రామ్

త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>