PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pressure-on-rajinikanth-to-start-political-party-latest-update684d7b38-4dd4-4d40-875c-7a6d819e762c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/pressure-on-rajinikanth-to-start-political-party-latest-update684d7b38-4dd4-4d40-875c-7a6d819e762c-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లోకి రాబోనంటూ రజినీకాంత్ తెగేసి చెప్పినా కూడా అభిమానులు ఆయన్ను వదలడంలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక చెన్నై వచ్చిన రజినీ.. పార్టీ పెట్టట్లేదని, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అప్పట్లో అభిమానులెవరూ ఆయనపై ఒత్తిడి తేలేదు, ఇతర నాయకులు కూడా ఆయన్ను కలసి పార్టీపై పునరాలోచించుకోవాలని కోరలేదు. కానీ ఇప్పుడు రజినీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ పెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ అభిమానులు రోడ్లెక్కుతున్నారు. rajinikanth;cinema;rajani kanth;december;assembly;chennai;partyరాజకీయాలపై రజినీ మనసు మార్చుకున్నారా..?రాజకీయాలపై రజినీ మనసు మార్చుకున్నారా..?rajinikanth;cinema;rajani kanth;december;assembly;chennai;partyMon, 11 Jan 2021 12:00:00 GMTరజినీకాంత్ తెగేసి చెప్పినా కూడా అభిమానులు ఆయన్ను వదలడంలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక చెన్నై వచ్చిన రజినీ.. పార్టీ పెట్టట్లేదని, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అప్పట్లో అభిమానులెవరూ ఆయనపై ఒత్తిడి తేలేదు, ఇతర నాయకులు కూడా ఆయన్ను కలసి పార్టీపై పునరాలోచించుకోవాలని కోరలేదు. కానీ ఇప్పుడు రజినీపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ పెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ అభిమానులు రోడ్లెక్కుతున్నారు.

రాజకీయ సన్యాసం పుచ్చుకున్నట్లుగా సూపర్ స్టార్ రజినీ వ్యవహరించడం ఆయన అభిమానులకు నచ్చలేదు. ఆయనపై ఒత్తిడి తెచ్చైనా రాజకీయాల్లోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నై వళ్లువర్‌ కోట్టం వద్ద రెండు రోజులుగా అభిమానులు ఆందోళన చేస్తున్నారు. రావయ్యా తలై వా అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో రజినీ పునరాలోచిస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

రజినీ రాజకీయాల ఊగిసలాట ఇప్పటిది కాదు. గతంలోనే ఆయన్ను పలు రాజకీయ పార్టీల అధినేతలు తమవైపు రావాలని అడిగారు. కొత్త పార్టీ పెట్టాలని అభిమానులు కూడా ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనిపై పలు దఫాలు చర్చలు జరిపిన రజినీ చివరకు తనకు తానే పార్టీ గురించి ప్రకటించారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ సినిమా డైలాగ్ కొట్టి మరీ డిసెంబర్ 31 డెడ్ లైన్ ప్రకిటంచారు. అంతలోనే ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆ డేట్ వెనక్కు పోయింది. అయితే అసలు పూర్తిగా రాజకీయాల్లోకి రానంటూ రజినీ తేల్చి చెప్పే సరికి అభిమానులు హతాశయులయ్యారు. కానీ తమ ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. రజినీ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన పార్టీ పెట్టాలని, పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. తమిళనాట రాజకీయ శూన్యత ఉందని, నాయకుడి అవసరం ఏర్పడిందని, రావయ్యా తలైవా అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు చెన్నైలో సందడి చేస్తున్నారు. ఇతర ప్రాంతాలనుంచి కూడా ఈ డిమాండ్లు ఎక్కువైతే రజినీ పార్టీ వ్యవహారంపై తిరిగి ఆలోచిస్తారేమో చూడాలి. 


వామ్మో.. క‌రోనా మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర వ‌ర‌ల్డ్ రికార్డు...!

అదిరిపోయే ఆఫర్.. రీఛార్జ్ చేయండి.. కార్ ఇంటికి తీసుకెళ్లండి..?

Shocking News: ఇక సినిమాలు చేయడం నాకు ఇష్టంలేదు: రామ్

త్రివిక్రమ్, రామ్ ల సినిమా అసలు ఉంటుందా..?

వాట్సాప్ వాడొద్దంటూ ప్రపంచ అత్యంత ధనవంతుడు ట్వీట్.. కారణమేంటంటే..

వీఆర్వో వ్యవస్థ రద్దుపై కేసీఆర్ వెనక్కు తగ్గినట్టేనా..?

డబ్బే డబ్బు : క్రిడిట్ స్కోర్ లేకపోయినా ఇలా చేస్తే చాలు రుణాలు వస్తాయి !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>