PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని... తెలంగాణా సిఎం కేసీఆర్ నేడు అన్నారు. దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని... రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే అనర్ధాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని నేడు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై నేడు సిఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిkcr;kcr;dharani;yajamanya;sathwara;telangana;district;good news;application;good newwzతెలంగాణాలో భూములు కొనే ఎన్నారైలకు కేసీఆర్ గుడ్ న్యూస్తెలంగాణాలో భూములు కొనే ఎన్నారైలకు కేసీఆర్ గుడ్ న్యూస్kcr;kcr;dharani;yajamanya;sathwara;telangana;district;good news;application;good newwzMon, 11 Jan 2021 18:45:00 GMTతెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని... తెలంగాణా సిఎం కేసీఆర్ నేడు అన్నారు.  దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని... రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే అనర్ధాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని నేడు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై నేడు సిఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తున్నదని ఆయన అన్నారు.

భూ రికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వందకు వంద శాతం విజయవంతమైందని సిఎం అన్నారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేందుకు అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా ధరణి పోర్టల్ లో చేయాలని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా పూనుకొని సత్వరం పరిష్కరించాలని ఆయన సూచించారు.

ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్ ను వెంటనే నిర్వహించాలని కలెక్టర్లను సిఎం కేసీఆర్ ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలని సూచనలు చేసారు. ధరణి పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి అని కేసీఆర్ సూచించారు. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి అని సూచనలు చేసారు. ఎన్నారైలకు తమ పాస్ పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్ లో అవకాశం కల్పించాలి అన్నారు. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్ బుక్ పొందే విధంగా ధరణిలో వెసులుబాటు కల్పించాలి అని సూచించారు.  గతంలో ఆధార్ కార్డు నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదు అని, అలాంటివారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వాలి అని సూచించారు.


తొలి దశలో ఇవ్వనున్న వ్యాక్సిన్ పూర్తిగా ఉచితం - ప్రధాని మోదీ

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది

పంచాయతీ ఎన్నికలపై కోర్టు సంచలన తీర్పు

ప్రధాని మోడీతో కేసీఆర్ చర్చ

ప్రజల మంచికోసమే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారట..?

దేశాన్ని కాపాడేందుకు భారీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>