SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/lal-bhaddur-shastri7c045d71-525d-4b77-ba38-ca3f6d359d8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/lal-bhaddur-shastri7c045d71-525d-4b77-ba38-ca3f6d359d8f-415x250-IndiaHerald.jpg గాంధీగారంటే స్వచ్ఛత, ఆత్మనిర్భరత, ధైర్యం, సర్వ మతసమానత్వం, శాంతి, మానవతావాదం,వీటన్నిటికీ ఒక ప్రతీక. బాపూజీ సత్యం, న్యాయం, మానవత,అహింసల కోసం పోరాడిన యోధుడు లాల్ బ‌హాదూర్ శాస్త్రి. భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి అరుదైన ధైర్యం మరియు సంకల్పం చూపించారు. దేశానికి 'జై జవాన్ జై కిసాన్' అనే నినాదాన్నిచ్చిన మ‌హానేత. మరణానంతరం భారత్ రత్న పొందిన మొదటి వ్యక్తి ఆయన, ఢిల్లీలో అతని స్మారకార్థం 'విజయ్ ఘాట్' ని నిర్మించారు.lal bhaddur shastri;govi;puri jagannadh;satya;vijay;india;pakistan;uttar pradesh;mohandas karamchand gandhi;రాజీనామా;lal bahadur shastri;january;prime minister;chief minister;rishabh pant;department of transportation;minister;tamilnadu;war;jawaan;joseph vijay;central government;kasi;party;kothapalli samuel jawaharహెరాల్డ్ స్మ‌రామీ : గాంధీ సిద్ధాంతాన్ని ఆచ‌రించి చూపిన లాల్ బ‌హాదూర్ శాస్త్రి.. నేడు వ‌ర్ధంతిహెరాల్డ్ స్మ‌రామీ : గాంధీ సిద్ధాంతాన్ని ఆచ‌రించి చూపిన లాల్ బ‌హాదూర్ శాస్త్రి.. నేడు వ‌ర్ధంతిlal bhaddur shastri;govi;puri jagannadh;satya;vijay;india;pakistan;uttar pradesh;mohandas karamchand gandhi;రాజీనామా;lal bahadur shastri;january;prime minister;chief minister;rishabh pant;department of transportation;minister;tamilnadu;war;jawaan;joseph vijay;central government;kasi;party;kothapalli samuel jawaharMon, 11 Jan 2021 07:00:00 GMTబాపూజీ  సత్యం, న్యాయం, మానవత,అహింసల కోసం పోరాడిన యోధుడు లాల్ బ‌హాదూర్ శాస్త్రి. భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి అరుదైన ధైర్యం మరియు సంకల్పం చూపించారు. దేశానికి 'జై జవాన్ జై కిసాన్' అనే నినాదాన్నిచ్చిన మ‌హానేత. మరణానంతరం భారత్ రత్న పొందిన మొదటి వ్యక్తి ఆయన, ఢిల్లీలో అతని స్మారకార్థం 'విజయ్ ఘాట్' ని నిర్మించారు. శాస్త్రి గారు తన జీవితాంతం నిజాయితీ మరియు వినయానికి ప్రసిద్ది చెందారు. అతను 11 జనవరి, 1966 న యుఎస్ఎస్ఆర్ లోని తాష్కెంట్ వద్ద గుండెపోటుతో మరణించాడు(ఇప్పటికి శాస్త్రి గారి మరణం మిస్టరీయే), లాల్ బహదూర్ శాస్త్రి  తన వ్యక్తిగతానికి తక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి.


1921లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనుటకై కాశీలోని జాతీయవాద కాశీ విద్యాపీఠములో చదవడము ప్రారంభించి.. 1926లో శాస్త్రి అనే పట్టభద్రుడయ్యాడు. స్వాంతంత్ర్యోద్యమ పోరాట కాలములో మొత్తము తొమ్మిది సంవత్సరాలు జైలులోనే గడిపాడు. స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశారు. 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశాడు.


సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గములో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా తర్వాత 1961 నుండి గృహ మంత్రిగా పనిచేశాడు. 1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ బహదూర్ శాస్త్రీ మరియీ మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రీకి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేసిరు . లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహర సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభానికి తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై బాటలు వేశాడు. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని, భారతదేశ ప్రభుత్వం వీరి మరణానంతరం 1966లో ప్రకటించింది.


రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>