PoliticsVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cock-fight-west-godavari-sankranthi-ap-politics76cf1e9b-0b35-4112-bac5-51f44b1e94e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cock-fight-west-godavari-sankranthi-ap-politics76cf1e9b-0b35-4112-bac5-51f44b1e94e2-415x250-IndiaHerald.jpgసంక్రాంతి పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలలోని పచ్చని పల్లెలు. ఆ తరువాత గుర్తొచ్చేది కోడి పందాలు. కొత్త అల్లుళ్ళతో, ధాన్యపు రాసులతో, ఆకసం లోని నక్షిత్రాలుగా ఇంటి ముందు ముగ్గులతో, బసవన్నలతోcock fight ,west godavari, sankranthi, ap politics;kranthi;kranti;ranina;makar sakranti;godavari river;sankranthi;police;festival;cycle;paruguటెన్షన్ పెడుతున్న “పందెం కోడి”..ఏరా పందాలు ఉన్నాయా లేవా..??టెన్షన్ పెడుతున్న “పందెం కోడి”..ఏరా పందాలు ఉన్నాయా లేవా..??cock fight ,west godavari, sankranthi, ap politics;kranthi;kranti;ranina;makar sakranti;godavari river;sankranthi;police;festival;cycle;paruguMon, 11 Jan 2021 23:22:28 GMTసంక్రాంతి పేరు చెప్పగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలలోని పచ్చని పల్లెలు. ఆ తరువాత గుర్తొచ్చేది కోడి పందాలు. కొత్త అల్లుళ్ళతో, ధాన్యపు రాసులతో, ఆకసం లోని నక్షిత్రాలుగా ఇంటి ముందు ముగ్గులతో, బసవన్నలతో. కోడిపందాలతో గోదావరి లోగిళ్ళు కళకళ లాడిపోతూ ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు వారి కట్టగట్టుకుని మరీ సంక్రాంతికి రయ్యి రయ్యి మంటూ వచ్చేస్తారు. ఇక కోడి పందాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు కోడి పందాలు లేకుండా సంక్రాంతి అనేది జరగనే జరగదు, ఓ చేత్తో కోళ్ళు పట్టుకుని మరో చేత్తో సైకిల్ తొక్కుకుంటూ చేల గట్లెంబడ ఉరుకుపరుగుల మీద వెళ్తుంటే ఆకిక్కే వేరబ్బా. అయితే ఎప్పటిలానే
కోడి పందాలపై సందిగ్హత నెలకొంది. అసలు కోడి పందాలు ఈ పాలి జరుగుతాయా లేదా అనే సందేహాలు ప్రతీ ఒక్కరి బుర్రలను తొలిచేస్తున్నాయి. ఏరా ఈ ఏడాది కోడి పందాలు జరుగుతాయంటావా అంటూ ఒకరిని ఒకరు ఎదురు పశ్నలు వేసుకుంటున్నారు. అయితే ఆరు నూరైనా నూరు ఆరైనా కోడి పందాలు జరిగి తీరాల్సిందే అంటూ సవాలు విసురుకునే వాళ్ళు లేకపోలేదు. అసలు కోడి పందాలు లేకపోతె గోదావరిలో రాజకీయలు ఎట్టా నడుస్తాయో మేము సూత్తామనే  వాళ్ళు లేకపోలేదు. కానీ
కరోనా నేపధ్యంలో అసలు కోడి పందాలకు అనుమతులు దొరకవని, ఒక పక్క హై కోర్టు ఆదేశాలు, కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం విధించే ఆంక్షలు వెరసి అసలు పందాలు ఉంటాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఆంక్షలు విధించినా మాపని మాదే అంటూ ఇప్పటికే గోదావారి జిల్లాలలో చాటుమాటుగా బరులు సిద్దం చేసేశారట. పండుగ ముందు వరకూ హడావిడి జరిగినా తరువాత ఎప్పటిలానే బరుల వద్ద పందెం రాయుళ్ళు బారులు తీరుతారని అంటున్నారు. ఇదిలాఉంటే అనుమతుల మాట అలా ఉంచితే పశ్చిమ పోలీసులు మాత్రం ఇప్పటికే పందాల కోసం సిద్దం చేస్తున్న బరులు ద్వంసం చేస్తూ, పలువురిపై కేసులు మోపుతూ కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.  


అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>