PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-coivdcee0f322-408e-4a50-9e66-70b9d535ce59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-coivdcee0f322-408e-4a50-9e66-70b9d535ce59-415x250-IndiaHerald.jpgఈ నెల 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. kcr coivd;kcr;pragathi;india;telangana;district;police;panchayati;prime minister;chief minister;thota chandrasekhar;traffic police;mantraప్రధాని మోడీతో కేసీఆర్ చర్చప్రధాని మోడీతో కేసీఆర్ చర్చkcr coivd;kcr;pragathi;india;telangana;district;police;panchayati;prime minister;chief minister;thota chandrasekhar;traffic police;mantraMon, 11 Jan 2021 19:13:11 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై  ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
    
‘‘సీరం రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ ను సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్లనే తెలంగాణలో అందించాలని నిర్ణయించాం. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుధ్య సిబ్బంది తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తాం. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించాం. ప్రాధాన్యతా క్రమంలో నిర్ణయించిన వారిని వ్యాక్సినేషన్ సెంటర్ కు తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలి. పోలీసులు, ఇతర భద్రతా బలగాలకు వ్యాక్సిన్ వేయించే బాధ్యతను పోలీస్  ఆఫీసర్ తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

   ‘‘వ్యాక్సిన్ ను అన్ని పీహెచ్సీ ల పరిధిలో ఇవ్వడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. వ్యాక్సిన్ ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేశాం. అన్ని స్థాయిల్లో వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు భాగస్వాములు కావాలి.  వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే వారికి వెంటనే వైద్య చికిత్స అందించడానికి వీలుగా వ్యాక్సిన్ సెంటర్ కు అనుబంధంగా ఒక గదిని, వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియలో కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.


జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది

పంచాయతీ ఎన్నికలపై కోర్టు సంచలన తీర్పు

ప్రజల మంచికోసమే నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తున్నారట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>