Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-familya6cc43dc-0c00-48e1-bd42-a9ec0f70c787-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-familya6cc43dc-0c00-48e1-bd42-a9ec0f70c787-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఓ స్టైలిష్ స్టార్, ఆయన తండ్రి అల్లు అరవింద్ ఓ ప్రొడ్యూసింగ్ స్టార్, ఇక ఆయన తమ్ముడు అల్లు శిరీశ్ కూడా సీనీ స్టారే. అయితే అల్లు శిరీశ్ తాజాగా తండ్రి అల్లు అరవింద్‌కు..allu family;allu aravind;allu arjun;tollywood;cinema;netizens;twitter;gift;arjun 1;father;geetha arts;anandam‘అల్లు బ్రాండ్’ గురించి బయటపెట్టిన అబ్బాయి.. ఇది వేరే బ్రాండ్‌లే..!‘అల్లు బ్రాండ్’ గురించి బయటపెట్టిన అబ్బాయి.. ఇది వేరే బ్రాండ్‌లే..!allu family;allu aravind;allu arjun;tollywood;cinema;netizens;twitter;gift;arjun 1;father;geetha arts;anandamMon, 11 Jan 2021 22:10:30 GMTఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్స్టైలిష్ స్టార్, ఆయన తండ్రి అల్లు అరవింద్ ఓ ప్రొడ్యూసింగ్ స్టార్, ఇక ఆయన తమ్ముడు అల్లు శిరీశ్ కూడా సీనీ స్టారే. అయితే అల్లు శిరీశ్ తాజాగా తండ్రి అల్లు అరవింద్‌కు సంబంధించిన ఓ బ్రాండ్ గురించి బయటపెట్టాడు. దీంతో ప్రస్తుతం ఆ బ్రాండ్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది.

టాలీవుడ్‌లోని గ్రేట్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ టాప్‌లో ఉంటారు. ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ స్టేచర్ ఉంది. సినిమాకు ఎంత పెట్టవచ్చు..? ఆ సినిమా వల్ల ఎంత లాభం వస్తుంది..? ఇలాంటి లెక్కలు వేయడంలో ఆయన దిట్ట. అందుకే పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్‌కి ఆయననే బ్రాండ్ అంటారు సినీ జనాలు. ఇంతవరకు అందరికీ తెలుసు. కానీ ఆయనకు నచ్చిన బ్రాండ్ ఏంటో తెలుసా..? అదేనండి మందు బ్రాండ్.. తెలియకపోతే అల్లు శిరీశ్ చెప్పేశాడు. ఇప్పుడు తెలుసుకోండి.

నిన్న ఆదివారం అల్లు అరవింద్ బర్త్ డే. ఈ సందర్భంగా అల్లు ఫ్యామిలీ మొత్తం ఆయనకు విషెస్ చెప్పింది. అందులో భాగంగానే అల్లు శిరీశ్ కూడా తండ్రికి విషెస్ చెప్పాడు. ఈ క్రమంలోనే ఆయనో కేక్ ఫోటోను షేర్ చేశాడు. ఆ కేక్‌‌పై గీతా ఆర్ట్స్, ఆహా యాప్ లోగోలతో పాటు అల్లు అరవిండ్ నిర్మించిన కొన్ని సినిమాల పోస్టర్లు కూడా ఉన్నాయి.

అంతేకాదు పక్కన ఓ రెండు ఫుల్ బాటిల్‌లు కూడా ఉన్నాయి. ఈ ఫుల్ బాటిల్స్ తన తండ్రికి గిఫ్ట్ ఇస్తున్నట్లు శిరీశ్ పెట్టిన ఫోటోతో తెలుస్తుంది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ తమకు అల్లు అరవింద్ గారి బ్రాండ్ తెలిసిపోయిందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో అదరగొడుతున్నారు. మరి దీనిపై అల్లు అరవింద్ కానీ, శిరీశ్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే తండ్రి బర్త్‌డేకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘నాన్న.. నీవు ఇలాంటి గొప్ప బర్త్ డేలు మరిన్ని జరుపుకోవాలి. ప్రతి ఒక్కరికీ, ప్రతి క్షణం ఎంతగానో అండగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నీలాంటి వ్యక్తితో మా జీవితాలు ముడిపడి ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బర్త్‌డే నిన్ను మరింత యువకుడిని చేయాలి’ అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 అల్లు అర్జున్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘తండ్రికి ఎంతో గొప్పగా విష్ చేశావం’టూ అభిమానులు అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు.
" style="height: 542px;">
" style="height: 524px;">

">
">
" style="height: 223px;">




అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>