PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderee57c82f-52b3-49dc-85e5-c4ad6377298d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murderee57c82f-52b3-49dc-85e5-c4ad6377298d-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్‌లో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ యువతితో తాగుబోతులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక వారి నుండి కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.murder;sports;tiru;district;police;uttar pradesh;air;arrest;letter;murder.;local languageనడిరోడ్డుపై తాగుబోతుల వీరంగం.. చెల్లి కోసం వెళ్లిన అన్న చివరకి..!?నడిరోడ్డుపై తాగుబోతుల వీరంగం.. చెల్లి కోసం వెళ్లిన అన్న చివరకి..!?murder;sports;tiru;district;police;uttar pradesh;air;arrest;letter;murder.;local languageMon, 11 Jan 2021 08:00:00 GMTఉత్తరప్రదేశ్‌లో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ యువతితో తాగుబోతులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక వారి నుండి కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల యువకుడు, అతని చెల్లెలితో కలిసి సెక్టార్‌ 8 లోని ఓ స్పోర్ట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే శుక్రవారం పని పూర్తయిన వారిద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 8.40 గంటల సమయంలో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఇద్దరు తాగుబోతులు వారిని అడ్డగించారు.

అయితే అందులో ఓ వ్యక్తి ఆ యువతిపై పడ్డాడు. ఇది యువతికి, తాగుబోతుకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. అయితే ఈ క్రమంలోనే తనతో అనుచితంగా ప్రవర్తించిన తాగుబోతును యువతి చెంపదెబ్బ కొట్టింది. దీంతో ఇద్దరు తాగుబోతులు వారి వద్ద ఉన్న కత్తిని తీసి యువతిని పొడిచి చంపడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నానికి అడ్డుకున్న యువతి సోదరుడు ఆమెను రక్షించాడు. ఆ తర్వాత ఇద్దరు తాగుబోతులు కత్తితో యువతి అన్నను పలుమార్లు పొడిచారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చేలోపే నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడిని పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి అతన్ని షిఫ్ట్ చేశారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి అతడు కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు తాగుబోతుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని పారిశుద్ద్య కార్మికుడు సర్వేష్ కుమార్‌గా (24) గుర్తించారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి!

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>