MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/you-nina-is-like-hero-nitin-rana1c376e3d-41e4-4435-82b3-8526f644e9c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/you-nina-is-like-hero-nitin-rana1c376e3d-41e4-4435-82b3-8526f644e9c2-415x250-IndiaHerald.jpgసమ్మర్‌ అంటేనే వసూళ్ల సీజన్. ఇలాంటి సీజన్‌లో లాంగ్‌ వీకెండ్‌ అంటే స్టార్లకి పండగ వస్తుంది. ఈ పండగని క్యాష్‌ చేసుకోవడానికే టాలీవుడ్‌ కుర్రాళ్లు పోటీ పడుతున్నారు. భారీ ఓపెనింగ్స్‌ కోసం పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మూడు నెలల ముందే స్లాట్‌ బుక్ చేసుకుంటున్నారు. సమ్మర్‌ బెర్త్‌లకి ఇప్పటి నుంచే కాంపిటీషన్ మొదలైంది. వేసవి సెలవుల్లో భారీ వసూళ్లు అందుకోవడానికి కొత్త పెళ్లికొడుకులు పోటీ పడుతున్నారు. హోళీ వీకెండ్‌ని క్యాష్‌ చేసుకోవాలని ఒక వైపు నితిన్, మరోవైపు రానా స్కెచ్చులేస్తున్నారు. సేఫ్‌ సyou nina is like hero nitin rana;venkatesh;rana;nithin;keerthi;india;cinema;nithin reddy;march;venky atluriనువ్వా.. నేనా అనేలా నితిన్, రానా..!నువ్వా.. నేనా అనేలా నితిన్, రానా..!you nina is like hero nitin rana;venkatesh;rana;nithin;keerthi;india;cinema;nithin reddy;march;venky atluriMon, 11 Jan 2021 21:30:00 GMT
సమ్మర్‌ బెర్త్‌లకి ఇప్పటి నుంచే కాంపిటీషన్ మొదలైంది. వేసవి సెలవుల్లో భారీ వసూళ్లు అందుకోవడానికి కొత్త పెళ్లికొడుకులు పోటీ పడుతున్నారు. హోళీ వీకెండ్‌ని క్యాష్‌ చేసుకోవాలని ఒక వైపు నితిన్, మరోవైపు రానా స్కెచ్చులేస్తున్నారు. సేఫ్‌ సీజన్‌లో స్ట్రాంగ్‌ కలెక్షన్స్ అందుకోవడానికి ఇద్దరూ ఒకే రోజు బరిలో దిగుతున్నారు.

రానా పాన్‌ ఇండియన్‌ లెవల్‌లో చేసిన సినిమా 'అరణ్య'. అటవీసంపదని కాపాడుకోవడం అందరి బాధ్యత అనే కాన్సెప్ట్‌తో రూపొందిందీ సినిమా. ఈ మూవీ కోసం రానా చాలా కష్టపడ్డాడు. వెయిట్ తగ్గి, అడవి మనిషిలాగే మారిపోయాడు. స్పెషల్‌ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. రానా చాలా కష్టపడి నటించిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కాబోతోంది.

నితిన్-కీర్తీ సురేశ్‌ కాంబినేషన్‌లో రూపొందిన అవుట్‌ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రంగ్‌దే'. వెంకీ అట్లూరి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా మార్చి 26న 'రంగ్‌దే' రిలీజ్ అవుతోంది. మరి కొత్త పెళ్లికొడుకులు నితిన్, రానా ఇద్దరు మార్చి 26నే ఫిక్స్‌ చేసుకోవడానికి లాంగ్‌ వీకెండే కారణం. ఎందుకంటే మార్చి28, 29ల్లో హోళీ సంబరాలున్నాయి. దీంతో నాలుగు రోజుల లాంగ్‌ వీకెండ్ వస్తోంది. అందుకే మార్చి 26న రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటున్నారు హీరోలు.

మొత్తానికి నితిన్, రానా పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు. మార్చి 26న నితిన్ రంగ్ దే రిలిజ్ కానుండగా.. మార్చి 26న రాణా అరణ్య విడుదల ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీ రాబోతోంది. చూద్దాం.. ఈ సినిమాలు వాళ్ల రేంజ్ ను అందుకుంటాయో లేదో.







సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు

మన తెలుగమ్మాయి.. అమెరికా అధ్యక్షుడికే షాకిచ్చింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>