MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aa-oka-cinema-kosam-mohan-babu-asthululani-thakatu-peatadata17f8b7ab-56f8-46e9-8c21-5801c595d3df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aa-oka-cinema-kosam-mohan-babu-asthululani-thakatu-peatadata17f8b7ab-56f8-46e9-8c21-5801c595d3df-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమాలు తీసేటప్పుడు దర్శకనిర్మాతలు, సినిమాను ఎలా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విషయాన్ని బాగా ఆలోచిస్తుంటారు. ఇందుకోసం చాలా డబ్బు వెచ్చించి,సినిమాలను చేస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు భారీ విజయాన్ని సాధించి, పెట్టిన పెట్టుబడిని రెండింతలు చేస్తాయి. మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచి భారీ నష్టాన్ని చవి చూపిస్తాయి. ఇక హీరోల విషయంలోనూ అలాగే జరుగుతుంది. వరుస హిట్లతో నడుస్తున్న హీరోలకు అనుకోకుండా బ్రేక్ పడితే, మరే సినిమా వారి దరిచేరదు. వరుసగా డిజాస్టర్ లు కొట్టి,mpohanbabu,loss,movies money;cbn;chiranjeevi;rajinikanth;editor mohan;mohan babu;raja;ravi anchor;cinema;tamil;king;industry;remake;director;king 1;father;darsakudu;allari;major chandrakanthఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!ఆ ఒక్క సినిమా కోసం మోహన్ బాబు ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడట!mpohanbabu,loss,movies money;cbn;chiranjeevi;rajinikanth;editor mohan;mohan babu;raja;ravi anchor;cinema;tamil;king;industry;remake;director;king 1;father;darsakudu;allari;major chandrakanthMon, 11 Jan 2021 14:30:00 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమాలు తీసేటప్పుడు దర్శకనిర్మాతలు, సినిమాను ఎలా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే విషయాన్ని బాగా ఆలోచిస్తుంటారు. ఇందుకోసం చాలా డబ్బు వెచ్చించి,సినిమాలను చేస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు  భారీ విజయాన్ని సాధించి, పెట్టిన పెట్టుబడిని రెండింతలు చేస్తాయి. మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచి  భారీ నష్టాన్ని చవి చూపిస్తాయి. ఇక హీరోల విషయంలోనూ అలాగే జరుగుతుంది. వరుస హిట్లతో నడుస్తున్న హీరోలకు అనుకోకుండా బ్రేక్ పడితే, మరే సినిమా వారి దరిచేరదు. వరుసగా డిజాస్టర్ లు కొట్టి,  ఇంకోసారి కొత్త సినిమాలు తీయడానికి ఏ దర్శకనిర్మాతలు ఆసక్తి చూపించరు.

ప్రస్తుతం ఇదే కోవకు చెందిన వారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. వరుస డిజాస్టర్ లతో కొట్టుమిట్టాడుతున్న మోహన్ బాబు సడన్గా ఒక రీమేక్ సినిమా కోసం ఏకంగా తన ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టాడట. ఆ సినిమా ఏంటో ఆయన ఎందుకు తన ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చిందో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

పూర్తి వివరాల్లోకి వెళితే 1990 నుంచి 1993 వరకు మంచి హిట్ లతో దూసుకువెళ్తున్న మోహన్ బాబు, "మేజర్ చంద్రకాంత్" సినిమా తరువాత అనుకున్న స్థాయిలో ఏ ఒక్క సినిమా పెద్ద హిట్టు కొట్టలేదు. ఈ సినిమా తర్వాత తీసిన అల్లరి పోలీసు, కుంతీపుత్రుడు, డిటెక్టివ్ నారద లాంటి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి. వరుస ఫ్లాప్ లతో విసిగిపోయిన మోహన్ బాబు తనకు అత్యంత సన్నిహితుడైన రజనీకాంత్ ను కలిశారు. అలా వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు  రజనీకాంత్ మాట్లాడుతూ.. "తమిళ్ లో హిట్ టాక్ తో నడుస్తున్న "నాట్టమై "సినిమా ను చూపించి,  ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకోమని సలహా ఇచ్చాడు.  కావాలంటే ఈ సినిమాలో నీకు తండ్రి పాత్ర నేను వహిస్తానని కూడా ధైర్యం చెప్పాడు".

మోహన్ బాబు  అప్పటికే "పుణ్యభూమి నా దేశం" అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.మరొక రీమేక్ సినిమా తీస్తే ప్రజలు ఆదరిస్తారో లేదో అన్న భయంతో తీయడానికి మొదట ఒప్పుకోలేదు. అప్పుడు రజిని ఈ సినిమా చేస్తే నీ ప్లాప్స్ అన్నిటికీ బ్రేక్ పడుతుందని ప్రోత్సహించడంతో "నాట్టమై " నిర్మాతను కలిసి రీమేక్ రైట్స్ తీసుకున్నారు మోహన్ బాబు. డైరెక్టర్ గోపాల్ ని ఈ సినిమాకు దర్శకత్వం వహించమని అడిగితే ఆయన రీమేక్ సినిమా అని  ఒప్పుకోలేదు. ఆ తరువాత డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి దర్శకుడుగా "పెదరాయుడు" సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మోహన్ బాబుకు తండ్రి గా నటించిన రజనీకాంత్ ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇందుకు కారణం స్వయంగా మోహన్ బాబు తన ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇక అప్పటి వరకు చిరంజీవి "ఘరానా మొగుడు" పది కోట్ల రూపాయల కలెక్షన్ కొట్టగా ఆ రికార్డును బ్రేక్ చేసి పెదరాయుడు సినిమా 12 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.


డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఎంతో సులభం.. ఆన్లైన్ లో అప్లై చేసుకోండి ఇలా..?

టాలీవుడ్ హీరోపై కేసు నమోదు...!

సినిమాల వల్లే చనిపోయాడు.. నర్సింగ్ యాదవ్ భార్య సంచలనం !

టీడీపీ కొంప ముంచుతున్న సీనియర్లు

ఇది టీడీపీకి అంతమే... ప్రమాదకర స్థితిలో టీడీపీ

అఖిల ప్రియకు మరో షాక్.... కోర్ట్ కీలక నిర్ణయం....!?

కేజిఎఫ్ సినిమా RRR కి సవాల్ విసురుతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>