Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/teacher-indecent-behavior-on-a-woman2baa119c-6b64-4d26-8825-ff344eec9b24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/teacher-indecent-behavior-on-a-woman2baa119c-6b64-4d26-8825-ff344eec9b24-415x250-IndiaHerald.jpgనేటి బాలలే రేపటి పౌరులు.. వారే దేశ భవిష్యత్తుకు పునాదులు.. వారిని అన్ని విధాల తీర్చిదిద్దేది గురువులు. గురువులు చెప్పే విద్యా, బుద్దులతోనే వారు ఉన్నత స్థానంలో ఉంటారు. బడులే దేవాలయాలుగా.. అందులో ఉండే గురువులే దేవుళ్లుగా పూజించే దేశం మనది.. అందుకే దేశ పౌరుల భవిష్యత్తును గురువుల చేతిలో పెడుతున్నాం.. కాగా దిశా నిర్దేశం చేయాల్సిన కొందరు ఉపాధ్యాయులే పొడదోవ పడుతున్నారు. విద్యార్థినులను, మహిళలను లైంఘికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే crime;women;deva;government;police;school;woman;jaggery;local language;lie;chityalaనన్నే వద్దంటావా.. నీ పిల్లల భవిష్యత్తును ఎలా నాశనం చేస్తానో చూడు.. అంటూ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడునన్నే వద్దంటావా.. నీ పిల్లల భవిష్యత్తును ఎలా నాశనం చేస్తానో చూడు.. అంటూ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుcrime;women;deva;government;police;school;woman;jaggery;local language;lie;chityalaMon, 11 Jan 2021 20:05:47 GMTగవర్నమెంట్ ఉపాద్యాయుడు ఓ మహిళలను లైంఘిక వేధింపులకు గురి చేశాడు.

తన కోరిక తీర్చమని బెదించాడు. దాన్ని తిరస్కరించిన ఆ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించి తన పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన బెల్లంకొండ మండలం న్యూ చిట్యాలలో జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాల గ్రామస్తుడు బొల్లా శ్రీనివాసరావు. ఈయన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని వృత్తిలో కొనసాగుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ మహిళ ఇంటింటికి వెళ్లి నిమ్మకాయలు విక్రయిస్తుండేది. రోజూ లాగే శనివారం కూడా ఆమె తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుంటే.. అదే సమయంలో ఆమె దగ్గరకు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు వచ్చి పైట చెంగు పట్టుకున్నాడు. అలాగే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

దాంతో ఆమె కోపంగా అతని నుంచి విడిపించుకుని వెళుతుంటే ఆమె వెంటే తన ఇంటికి వచ్చాడు. అక్కడ కూడా ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే ఆమె తల్లదండ్రులు ఉపాధ్యాయునికి అడ్డొచ్చారు. దాంతో ఆ ఉపాధ్యాయుడు ఆ మహిళ తల్లి దండ్రులను కొట్టి ఆమెతో గొడవ పడి.. అసభ్య కరంగా ప్రవర్తించాడు.. నన్నే కాదంటావా.. నువ్వు నా కోరిక తీర్చితే నీ పిల్లలకు చదువు చెబుతా.. లేకుంటే వారి భవిష్యత్తును ఏం చేస్తానో నాకే తెలియదంటూ ఆ మహిళను బెదిరించి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో బయపడిపోయిన ఆ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పాటుగా ఆ ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ధర్నా చేపట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


సుప్రీం కోర్ట్ కి టీడీపీ... ఏం జరుగుతుంది...?

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఆ వ్యాక్సిన్ కొనేందుకు కేంద్రం ప్రయత్నాలు.. ఒక్కో డోసు ఎంతంటే?

నితీశ్ కుమార్ ఒక బ్లాక్ మెయిలర్! తేజస్వి యాదవ్ సంచలన కామెంట్లు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>