PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc-brothers-politicsa4645bfc-00d6-480b-a2a3-9ab311c21781-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jc-brothers-politicsa4645bfc-00d6-480b-a2a3-9ab311c21781-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇటీవలే జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్షలంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన న్యూస్ తో వార్తల్లోకెక్కారు జెసి దివాకర్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు అధికార ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన జెసి దివాకర్ రెడ్డి...jc brothers politics;prabhakar;prabhakar reddy;tiru;vishwa;congress;district;chintamaneni prabhakar;fire;tdp;ycp;parakala prabhakar;reddy;v;partyజెసి బ్రదర్స్ ని టీడీపీ నాయకులే కార్నర్ చేస్తున్నారా...?జెసి బ్రదర్స్ ని టీడీపీ నాయకులే కార్నర్ చేస్తున్నారా...?jc brothers politics;prabhakar;prabhakar reddy;tiru;vishwa;congress;district;chintamaneni prabhakar;fire;tdp;ycp;parakala prabhakar;reddy;v;partySun, 10 Jan 2021 09:00:00 GMTజిల్లా తాడిపత్రిలో ఇటీవలే జేసీ బ్రదర్స్‌  ఆమరణ దీక్షలంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో సంచలన న్యూస్ తో వార్తల్లోకెక్కారు జెసి దివాకర్ రెడ్డి. నిన్న మొన్నటి వరకు అధికార ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన జెసి దివాకర్ రెడ్డి... ఇప్పుడు సొంత పార్టీనే కార్నర్ చేసి మాట్లాడినట్లు అనిపించింది. అసలు విషయానికి వస్తే.... అనంతపురం జిల్లా లోని పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ బలగం పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జెసి బ్రదర్స్ అయిన జెసి దివాకర్ రెడ్డి మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి.

అయితే ఈ మధ్య కాలంలో రాజకీయంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు జేసీ బ్రదర్స్... ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి తమను టార్గెట్ చేస్తోందని పలుమార్లు వెల్లడించారు. ఓవైపు రాజకీయంగా పట్టు సాధించాలనే కోరిక ఉంటే మరోవైపు ఏదో తెలియని ఆందోళన వారి చుట్టూ తిరుగుతోంది. తాజాగా జేసీ బ్రదర్స్ చేసిన షాకింగ్ కామెంట్ వింటే అందరికీ అదే అనిపిస్తుంది. జెసి దివాకర్ రెడ్డి మరియు అతని సోదరుడు ప్రభాకర్ రెడ్డి  ఓ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి.. తప్పు చేశామని అనిపిస్తోంది.. అని అనడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడో వదిలేసిన కాంగ్రెస్ గురించి... ప్రస్తుతం ఉన్న టిడిపి గురించి ఆలోచించకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటంటూ అభిప్రాయపడుతున్నారు కొందరు సీనియర్ నేతలు.

ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఇలా కాంగ్రెస్ గురించి ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. గత 2014 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి ఎంపీగా - ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికలలో ఇద్దరు తమ వారసులను రంగంలోకి దింపారు. ఇలా అండదండగా నిలబడ్డ టీడీపీ గురించి విస్మరించి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం గమనార్హం. బహుశా టిడిపి లో మెల్లమెల్లగా వీరికి ప్రాధాన్యత తగ్గుతుందేమో అని భావిస్తున్నారు కొందరు రాజకీయ నేతలు. కీలక సమయాల్లో టిడిపి నుండి జెసి కుటుంబానికి ఆదరణ లభించడం లేదనే వార్తలు జెసి వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు పై టిడిపి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. అంతే కాకుండా టీడీపీలో మిగిలిన నాయకులు కూడా వీరిని టార్గెట్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. మరి భవిష్యత్తులో వీరి పరిస్థితి ఏమి కానుందో తెలియడం లేదు.


రేవంత్... బండి సంజయ్ కోసం ట్రై చేస్తున్నారా...?

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>