PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chickend6945253-5ec8-40ef-ad00-38efa0d9734c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/chickend6945253-5ec8-40ef-ad00-38efa0d9734c-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోయాయి. ముఖ్యంగా ఏపీలో ఈ వ్యాధి ప్ర‌భావంతో కోళ్ల ప‌రిశ్ర‌మ కుదేలు అవుతోన్న ప‌రిస్థితి. ప్ర‌స్తుతం సంక్రాంతి సీజ‌న్ నేప‌థ్యంలో పంట చేతికి వ‌చ్చేవేళ ఈ బ‌ర్డ్ ఫ్లూ వ్యాధి ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌న్న వార్త‌ల‌తో చికెన్ రేట్ల‌కు డిమాండ్ ప‌డిపోయింది. దీంతో చికెన్ కొనే వారు లేక రేట్లు ప‌డిపోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చికెన్ రేట్లు రూ. 250 ఉండ‌గా... ఇప్పుడు అది రు. 150 నుంచి రు. 160 కు ప‌డిపోయింది. మ‌రి కొన్ని చోట్ల అయితే రు. 120కే చికెన్ ఇస్తామ‌ని chicken;kranthi;kranti;makar sakranti;telangana;sankranthi;chicken;letterఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!ఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!chicken;kranthi;kranti;makar sakranti;telangana;sankranthi;chicken;letterSun, 10 Jan 2021 17:27:25 GMTప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని క‌రోనా కొత్త వైర‌స్‌లు ఎంత‌లా భ‌య‌పెడుతున్నాయో ?  బ‌ర్డ్ ఫ్లై వైర‌స్ కూడా అంతే భ‌య‌పెడుతోంది. నార్త్‌ల ప్రారంభ‌మైన ఈ వైర‌స్ ప్ర‌భావం ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కూడా గ‌ట్టిగానే ప‌డింది. ఇక కేర‌ళ‌ను అయితే ఈ వైర‌స్ తీవ్రంగా భ‌య‌పెడుతోంది. ఈ క్ర‌మంలోనే కేర‌ళ ప్ర‌భుత్వం రంగంలోకి దిగి ఈ వైర‌స్ ఎక్క‌డ వ్యాప్తి చెందుతుందో అని భావించి వేలాది కోళ్ల‌ను, బాతుల‌ను స్వ‌యంగా చంపేస్తోంది. ఇందుకు గాను రైతుల‌కు ప‌రిహారం కూడా ఇస్తోంది. అయితే ఈ ప‌రిహారం త‌మ‌కు స‌రిపోద‌ని కేర‌ళ రైతులు ప్ర‌భుత్వంపై గగ్గోలు పెడుతున్నారు.

ఇక బ‌ర్డ్ ఫ్లూ ప్ర‌భావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోయాయి. ముఖ్యంగా ఏపీలో ఈ వ్యాధి ప్ర‌భావంతో కోళ్ల ప‌రిశ్ర‌మ కుదేలు అవుతోన్న ప‌రిస్థితి. ప్ర‌స్తుతం సంక్రాంతి సీజ‌న్ నేప‌థ్యంలో పంట చేతికి వ‌చ్చేవేళ ఈ బ‌ర్డ్ ఫ్లూ వ్యాధి ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌న్న వార్త‌ల‌తో చికెన్ రేట్ల‌కు డిమాండ్ ప‌డిపోయింది. దీంతో చికెన్ కొనే వారు లేక రేట్లు ప‌డిపోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చికెన్ రేట్లు రూ. 250 ఉండ‌గా... ఇప్పుడు అది రు. 150 నుంచి రు. 160 కు ప‌డిపోయింది. మ‌రి కొన్ని చోట్ల అయితే రు. 120కే చికెన్ ఇస్తామ‌ని చెపుతున్నారు.

ఇదే పంథా మ‌రికొన్ని రోజులు కంటిన్యూ అయితే చికెన్ ధ‌ర‌లు మ‌రింత గా ప‌డిపోవ‌డంతో పాటు పౌల్ట్రీ రైతులు పీక‌ల్లోతు న‌ష్టాల్లో కూరుకుపోయే ప్ర‌మాదం ఉంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఈ వ్యాధిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించి తాము న‌ష్ట‌పోకుండా చూడాల‌ని కోరుతున్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలో సైతం చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఏపీలో ప్ర‌భుత్వం ఈ వార్త‌ల‌తో అప్ర‌మ‌త్తం కావ‌డంతో పాటు అన్ని జిల్లాల్లోనూ స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ టీం ల‌ను ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితి స‌మీక్షిస్తోంది. 


షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>