PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-jagan-demolish-the-plan-og-nimmagaddac7d7d290-5a0b-48e8-bd76-3e2006a30eea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-jagan-demolish-the-plan-og-nimmagaddac7d7d290-5a0b-48e8-bd76-3e2006a30eea-415x250-IndiaHerald.jpgవిజ‌య‌వాడ కూడా చేర‌క ముందుగానే షెడ్యూల్ విడుద‌ల చేస్తూ.. నిమ్మ‌గ‌డ్డ సంచ‌ల న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది. సీపీఎం మిన‌హా అన్ని అధికార పార్టీ త‌ప్ప మిగిలిన రాజ‌కీయ ప‌క్షాలు అన్నీ ఎన్నిక‌ల‌ను స్వాగ‌తించాయి. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం ఈ ఎన్నిక‌ల‌ను తీవ్ర‌స్థాయిలో తిప్పి కొట్టింది. ముఖ్యంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. ఎన్నిక‌ల‌కు తాము స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేద‌ని క‌మిష‌న‌ర్‌కు లేఖ సంధించారు. దీంతో ఇది వివాదంగా మారింది. ఇక‌, ప్ర‌భుత్వంnimmagadda jagan;view;court;letter;local language;supreme court;dookudu;partyనిమ్మ‌గ‌డ్డ ఎత్తును జ‌గ‌న్ అక్క‌డే చిత్తు చేస్తాడా....!నిమ్మ‌గ‌డ్డ ఎత్తును జ‌గ‌న్ అక్క‌డే చిత్తు చేస్తాడా....!nimmagadda jagan;view;court;letter;local language;supreme court;dookudu;partySun, 10 Jan 2021 10:06:09 GMTరాష్ట్రంలో అనూహ్యంగా స్థానిక ఎన్నిక‌ల షెడ్యూల్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముగ్గురు కీల‌క అధికారులు రాష్ట్ర ఎన్ని క‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌తో హైద‌రాబాద్‌లో భేటీ అయి.. రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు స‌రైన వాతావ‌ర‌ణం లేద‌ని.. క‌రోనా స్ర్టెయిన్ ప్ర‌మాదం పొంచి ఉంద‌ని, అదే స‌మ‌యంలోకేంద్ర ప్ర‌భుత్వం కూడా టీకా ఇచ్చేందుకు ఏర్పా టు చేస్తోంద‌ని.. ఈ క్ర‌మంలో అధికారులు, సిబ్బంది అంద‌రూ.. ఈ టీకా ఇచ్చే కార్య‌క్ర‌మంలో బిజీగా ఉంటార‌ని వివ‌రించారు. సో.. ఎన్నిక‌ల‌ను మ‌రో రెండు మాసాల వ‌ర‌కు లేదా తొలిద‌శ టీకా కార్య‌క్ర‌మం పూర్త‌య్యే వ‌ర‌కు నిలుపుద‌ల చేయాల‌ని కోరారు. దీనిపై మ‌రోసారి అంటే.. 13న చ‌ర్చిద్దామ‌ని ప్ర‌తిపాదించి వెనుదిరిగారు.

అయితే.. ఈ ముగ్గురు అధికారులు ఇంకా విజ‌య‌వాడ కూడా చేర‌క ముందుగానే షెడ్యూల్ విడుద‌ల చేస్తూ.. నిమ్మ‌గ‌డ్డ సంచ‌ల న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది. సీపీఎం మిన‌హా అన్ని అధికార పార్టీ త‌ప్ప మిగిలిన రాజ‌కీయ ప‌క్షాలు అన్నీ ఎన్నిక‌ల‌ను స్వాగ‌తించాయి. అయితే.. ప్ర‌భుత్వం మాత్రం ఈ ఎన్నిక‌ల‌ను తీవ్ర‌స్థాయిలో తిప్పి కొట్టింది. ముఖ్యంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. ఎన్నిక‌ల‌కు తాము స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేద‌ని క‌మిష‌న‌ర్‌కు లేఖ సంధించారు. దీంతో ఇది వివాదంగా మారింది.

ఇక‌, ప్ర‌భుత్వం ఈ విష‌యంపై సుప్రీం కోర్టుకు వెళ్లాల‌నే వ్యూహంతో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. నిమ్మ‌గ‌డ్డ‌.. వ‌రుస సెల‌వులును ఆస‌రా చేసుకుని షెడ్యూల్ విడుద‌ల చేశార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం జ‌గ‌న్ కూడా దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌లు నిర్వ‌హిం చ‌రాద‌న్న త‌మ వాద‌న వీగిపోకుండా చూసుకునేందుకు ఇప్ప‌టికే న్యాయ నిపుణుల‌తో మంతనాలు సాగిస్తోంది. మ‌రోవైపు గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ కూడా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దూకుడుపై ఆరాతీస్తున్నారు. దీంతో ఎన్నిక‌ల విష‌యంలో మ‌రోసారి ప్ర‌భుత్వం వ‌ర్సెస్ నిమ్మ‌గ‌డ్డ వివాదం తీవ్ర‌స్థాయిలో సాగుతుంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

అయితే.. మ‌రోవైపు.. నిమ్మ‌గ‌డ్డ త‌న అస్త్రాల‌ను వ‌రుస‌గా ప్ర‌యోగిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రించాల్సిందేన‌ని.. లేక‌పోతే.. సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించి ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌ట్టు అవుతుంద‌ని సీఎస్‌కు లేఖ రాశారు. కానీ, ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స్పంద‌నా రాలేదు. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ వ‌ర్సెస్ నిమ్మ‌గ‌డ్డ.. వ్య‌వ‌హారం రాబోయే రెండు మూడు రోజుల్లో తీవ్రంగా మారడం ఖాయంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు నుంచి ప్ర‌భుత్వానికి సానుకూల ప‌వ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యంలో జ‌గ‌న్ అక్క‌డ స‌క్సెస్ అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి ఏంజ‌రుగుతుందో ?  చూడాలి. 


కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>