PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-covid-vacciene049dc144-28d4-4e6c-a090-a53602f3a1f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-covid-vacciene049dc144-28d4-4e6c-a090-a53602f3a1f5-415x250-IndiaHerald.jpg ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా కోవిడ్ వ్యాక్సినేషన్ పనుల్లో బిజీగా ఉంటున్న సమయంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమనే చర్చ సామాన్య జనాల నుంచే వస్తోంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించడంపై కొందరు జనాలు మండిపడుతున్నారు. chandrababu covid vacciene;cbn;prasad;jagan;andhra pradesh;high court;january;collector;mandalam;tdp;local language;central government;polio;nimmagadda prasadచంద్రబాబును తిట్టిపోస్తున్న జనాలు!చంద్రబాబును తిట్టిపోస్తున్న జనాలు!chandrababu covid vacciene;cbn;prasad;jagan;andhra pradesh;high court;january;collector;mandalam;tdp;local language;central government;polio;nimmagadda prasadSun, 10 Jan 2021 18:49:09 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థ ఎన్నికల వివాదం ముదురుతోంది. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్.. మరింత దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ సర్కార్ మాత్రం ఎన్నికలు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఏపీ ఉద్యోగ సంఘాలు కూడా నిమ్మగడ్డపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు ఉద్యోగం కంటే ప్రాణాలే ముఖ్యమని, అవసరమైతే ఎన్నికలను బహిష్కరిస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం ప్రకటించింది. ఈ వివాదం కొనసాగుతుండగా.. ఏపీ జనాల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. అయితే దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణిపై చర్చ జరుగుతుండగా.. ఏపీకి ఇదేం దుర్గతి పట్టిందని కొందరు ఆవేదన చెందుతున్నారు.

            టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవరసం ఏంటనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. జనవరి 16 నుంచి కోవిడ్ టీకా పంపిణి ప్రారంభమవుతుందని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలన్ని ఆ ఏర్పాట్లలోనే ఉన్నాయి. కేంద్ర నుంచి వచ్చే వ్యాక్సిన్లను ఎక్కడ భద్రపరచాలి.. అక్కడి నుంచి టీకా పంపిణి కేంద్రాలకు ఎలా సరఫరా చేయాలని అధికారులు రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఏపీకి కూడా మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్లు రానున్నాయి. అప్పటి నుంచి సర్కార్ యంత్రాంగమంతా అలర్ట్ గా ఉండాల్సిందే. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన, జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన.. మండలంలో సీనియర్ అధికారి అధ్యక్షతన కమిటీలను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది.

                  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా కోవిడ్ వ్యాక్సినేషన్ పనుల్లో బిజీగా ఉంటున్న సమయంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమనే చర్చ సామాన్య జనాల నుంచే వస్తోంది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించడంపై కొందరు జనాలు మండిపడుతున్నారు.  కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంత ముఖ్యమైందో, ఎంతో కఠినమైందనే విషయాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రతి ఏటా నిర్వహించే పల్స్ పోలియో డ్రైవ్ ను కేంద్రం వాయిదా వేసిందని.. అలాంటిది స్థానిక సంస్థల ఎన్నికలను మరికొంత కాలం వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని కొందరు నిలదీస్తున్నారు. 


భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>