PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/latest-news2c0ea295-8450-482b-95e9-4ec4aea8ced2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/latest-news2c0ea295-8450-482b-95e9-4ec4aea8ced2-415x250-IndiaHerald.jpgతూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు జనసేనాని విచ్చేసి తన మద్దతు తెలిపారు. కొత్తపాకలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేస్తామని, వాటి కోసమే పోరాటం చేస్తామన్నారు.pawan kalyan;pawan;kalyan;varsha;yajamanya;godavari river;jagan;janasena;ram madhav;district;industries;government;local language;ycp;janasena party;tuni;research and analysis wing;reddy;party'దివిస్ పరిశ్రమ ఏర్పాటు' నిరసన సభలో జనసేనాని ఆసక్తికర ప్రశ్నావళి...'దివిస్ పరిశ్రమ ఏర్పాటు' నిరసన సభలో జనసేనాని ఆసక్తికర ప్రశ్నావళి...pawan kalyan;pawan;kalyan;varsha;yajamanya;godavari river;jagan;janasena;ram madhav;district;industries;government;local language;ycp;janasena party;tuni;research and analysis wing;reddy;partySun, 10 Jan 2021 07:40:00 GMTజనసేన పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్.. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు జనసేనాని విచ్చేసి తన మద్దతు తెలిపారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తన సభలోనే సీఎం జగన్ ప్రసంగం ప్లే చేసి మరీ జగన్ సర్కారును ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించారు.  అనంతరం కొత్తపాకలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేస్తామని, వాటి కోసమే పోరాటం చేస్తామన్నారు. దివీస్ సంస్థపై గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను గుర్తు చేస్తున్నామంటూ.. అప్పట్లో సీఎం చేసిన ప్రసంగాన్ని ప్లే చేశారు. ఆనాడు మీరిచ్చిన మాటలను మీరే నిలబెట్టుకోవాలని సీఎం జగన్ను పవన్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో దివీస్‌కు అనుమతులు ఇవ్వబోమని చెప్పారు. ఇక రాజకీయ నాయకులకు ప్రజలే విలువలు నేర్పించాలని పవన్‌ వ్యాఖ్యానించారు. 




కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ‘‘అనేక మంది నుంచి వేల ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టారు. దివిస్‌ పరిశ్రమకు 690 ఎకరాలు ఇచ్చారు.. వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? దివీస్‌లో మొత్తం 1,500 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కాలుష్య పరిశ్రమలు తెస్తే ప్రజలకు ఎక్కడికి వెళ్లాలి? మేం కుల, కుటుంబ రాజకీయాలు చేయం. రూ. వేల కోట్లు సంపాదించాలనే కోరిక నాకు లేదు. సామాజిక ప్రభావ అంచనా వేయకుండా పరిశ్రమలకు భూములు ఇస్తారా? వైసీపీకి చెందిన రాంకీ ద్వారా అంచనా వేయించారు. దివీస్‌ పరిశ్రమ కాలుష్యం మత్స్య సంపదను నాశనం చేయదని హామీ ఇవ్వాలి. కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి వ్యాధులూ రావని హామీ ఇవ్వాలి’’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.



మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయని, ఇంత కాలుష్యం వెదజల్లుతుంటే పీసీబీలు ఏం చేస్తున్నాయని పవన్‌ ప్రశ్నించారు. కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ‘‘వ్యాధులు లేని సమాజాన్ని కోరుకుంటున్నాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను రానివ్వబోమని మీరే చెప్పారు. దివిస్‌ పరిశ్రమ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుంది. కాలుష్య జలాలు రావని దివిస్‌ యాజమాన్యం హామీ ఇవ్వగలదా?’’ అని పవన్‌ ప్రశ్నించారు. ఇక, అధికార వైసీపీ నాయకులు తనను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ మాటలు తూలనని పవన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తనను సంస్కారవంతంగా పెంచారన్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే నాయకులు సుఖంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ప్రజలు తనకు ఓటు వేయకున్నా సైద్ధాంతిక బలంతోనే నిలబడ్డానని చెప్పారు. తనకు ఆస్తులు, అధికారాలు అక్కర్లేదని, ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు.




ఒకరిని కాపాడబోయి ఒకరు...విద్యుత్ షాక్ తో నలుగురి మృతి..

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>