PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/amma-vodi96496dcd-25a9-49d8-80c0-4104bd463052-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/amma-vodi96496dcd-25a9-49d8-80c0-4104bd463052-415x250-IndiaHerald.jpgఈనెల 11న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటనతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి రెండో విడత అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తో ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. దీంతో అమ్మఒడి అమలుపై అనుమానాలు నెలకొన్నాయి. అమ్మఒడి ఆర్థిక సాయం అందబోదని చాలామంది దిగులు పడ్డారు. అయితే అమ్మఒడిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఆరు నూరైనా ఆర్థిక సాయం ఆగదని, ఈనెల 11న కచ్చితంగా తల్లుల బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ అవుతుందని భరోసా ఇచ్చింది. amma vodi;amala akkineni;kumaar;ranina;jagan;district;nellore;panchayati;chief minister;ammavodiఎన్నికల కోడ్ ఉన్నా అమ్మఒడి ఆగదు.. ఎందుకంటే..?ఎన్నికల కోడ్ ఉన్నా అమ్మఒడి ఆగదు.. ఎందుకంటే..?amma vodi;amala akkineni;kumaar;ranina;jagan;district;nellore;panchayati;chief minister;ammavodiSun, 10 Jan 2021 07:00:00 GMTముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటనతో ప్రతిష్టాత్మకంగా అమ్మఒడి రెండో విడత అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న వేళ.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తో ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. దీంతో అమ్మఒడి అమలుపై అనుమానాలు నెలకొన్నాయి. అమ్మఒడి ఆర్థిక సాయం అందబోదని చాలామంది దిగులు పడ్డారు. అయితే అమ్మఒడిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఆరు నూరైనా ఆర్థిక సాయం ఆగదని, ఈనెల 11న కచ్చితంగా తల్లుల బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ అవుతుందని భరోసా ఇచ్చింది.

ఈ కార్యక్రమానికి సంబంధించి జీవో-3 విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,76,589 మంది అదనంగా లబ్ధిదారుల జాబితాలో చేరారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 42,24,302 మందికి అమ్మఒడి నిధులు జమ కాగా.. ఈ ఏడాది 44,00,891మందికి అమ్మఒడి అమలు కాబోతోంది. జగనన్న అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు తల్లులకు అందించనుండగా.. ఈ మొత్తంలో రూ.1,000ని టాయిలెట్ల నిర్వహణ నిధికి జమచేశారు అధికారులు. అంటే మిగిలిన రూ.14,000ను తల్లుల ఖాతాల్లో నేరుగా జమఅవుతాయనమాట.

ఓవైపు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేసినా ప్రభుత్వం మాత్రం అమ్మఒడి అమలుకి రంగం సిద్దం చేసింది. నెల్లూరులో సీఎం జగన్ పర్యటించే ప్రాంతం అర్బన్ ఏరియా కావడంతో అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉండదని స్పష్టంచేశారు జిల్లా అధికారులు. ప్రస్తుతం జరగబోయేవి కేవలం పంచాయతీ ఎన్నికలే కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లోనే కోడ్ అమలులో ఉంటుందని అంటున్నారు. అయితే లబ్ధిదారులకు ప్రాంతాలతో సంబంధం లేదని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారంతా ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారనే వాదన కూడా ఉంది.

ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఆపేందుకు సిద్ధంగా లేదు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కావడంతో దీన్ని యధాతథంగా అమలు చేయబోతున్నారు. కోడ్ అడ్డుగా ఉందని ప్రతిపక్షాలంటున్నా కూడా అర్బన్, రూరల్ ఏరియాలనే లాజిక్ తో ముఖ్యమంత్రి బహిరంగ సభను ముందు అనుకున్నట్టుగానే నిర్వహించబోతున్నారు.


ఒకరిని కాపాడబోయి ఒకరు...విద్యుత్ షాక్ తో నలుగురి మృతి..

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>