PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-trump-behind-in-the-white-house-race3dd494f9-98e9-4812-b5bf-dc0e3b8056ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/is-trump-behind-in-the-white-house-race3dd494f9-98e9-4812-b5bf-dc0e3b8056ef-415x250-IndiaHerald.jpgఇటీవలే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈనెల 20న మధ్యాహ్నంతో తన పదవీకాలం పూర్తి చేసుకుని అధ్యక్ష పీఠం దిగనున్నారు.కానీ రెండు రోజుల కిందట వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంలో జరిగిన అరాచకం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌ ను మరలా తల ఎత్తుకోలేని తరహాలో ఆయన్ను సాగనంపాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. అమెరికాలోని రాజకీయ, రాజ్యాంగ, న్యాయ కోవిదులంతా పాత అధ్యక్షుడిని శాశ్వతంగా పంపడం ఎలా అని ఆలోచిస్తున్నారని తెలిసిందిdonald trump;tara;american samoa;donald trump;january;qualification;houseఅమెరికాలో ట్రంప్ పై పెద్ద కుట్రకే ప్లాన్ జరుగుతుందన్నమాట!అమెరికాలో ట్రంప్ పై పెద్ద కుట్రకే ప్లాన్ జరుగుతుందన్నమాట!donald trump;tara;american samoa;donald trump;january;qualification;houseSun, 10 Jan 2021 21:35:00 GMTఇటీవలే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈనెల 20న మధ్యాహ్నంతో తన పదవీకాలం పూర్తి చేసుకుని అధ్యక్ష పీఠం దిగనున్నారు. ఇక అదే రోజు కొత్త అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ రెండు రోజుల కిందట వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంలో జరిగిన అరాచకం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌ ను మరలా తల ఎత్తుకోలేని తరహాలో ఆయన్ను సాగనంపాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. అమెరికాలోని రాజకీయ, రాజ్యాంగ, న్యాయ కోవిదులంతా పాత అధ్యక్షుడిని శాశ్వతంగా పంపడం ఎలా అని ఆలోచిస్తున్నారని తెలిసింది. అంటే ఇక ఆయన తిరిగి అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు అర్హత లేకుండా చేయాలని వారి ఆలోచనగా తెలుస్తోంది.



ప్రస్తుత అధ్యక్షుడి పదవీ కాలం చివరి రోజు అంటే జనవరి 20 వరకూ కూడా ట్రంప్‌ను ఆ పదవిలో ఉంచకుండా ముందుగానే దింపేయాలని యోచిస్తున్నారు. ఇందుకు ఉన్న అవకాశాలపై కుస్తీ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ట్రంప్‌ మరోమారు పోటీ చేసే అవకాశం ఉంది. 2024లో పోటీ చేసే ఆలోచన ఉందని కూడా ట్రంప్‌ గతంలోనే తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు ఆ అర్హత లేకుండా చేయాలని డెమొక్రాట్లు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకని.. ట్రంప్‌పై అభిశంసన తీర్మానం చేయాలని భావిస్తున్నారు. 2019లో ట్రంప్ ఓసారి అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కానీ, అది వీగిపోయింది. ఇలా కాకపోతే 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించిగానీ ట్రంప్ పదవిని ఊడగొట్టాలని భావిస్తున్నారు. అయితే, అభిశంసన చేయడం కాస్త ప్రక్రియతో కూడుకున్న వ్యవహారమే..



మొదట హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారు. సాధారణ మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందితే దాన్ని సెనేట్‌కు పంపుతారు. అక్కడ కూడా దీనిపై చర్చ జరుగుతుంది. అధ్యక్షుడికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను పరిశీలిస్తారు. సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. అయితే, భవిష్యత్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ట్రంప్‌ను నిషేధించే తీర్మానాన్ని సెనేట్‌ ఆమోదించే అవకాశాలూ లేకపోలేదు. ఈ తీర్మానం నెగ్గటానికి సాధారణ మెజార్టీ ఉంటే సరిపోతుంది. ఇది కాస్త సాధ్యమయ్యేదిగానే కనిపిస్తోంది. డెమొక్రాట్లతో పాటు కొంతమంది రిపబ్లికన్‌లు కూడా ఈ తీర్మానానికి మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. అయితే, 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించటం చాలా కష్టం. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్, కేబినెట్‌ సభ్యులంతా అధ్యక్షుడు అసమర్థుడని ధ్రువీకరించాలి. దాన్ని సెనేట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. అభిశంసన కూడా చాలా సమయం పడుతుంది కాబట్టి.. ఇప్పుడు పదవిలోంచి తీసేసేట్లుగా కాకుండా భవిష్యత్‌లో ట్రంప్‌ మళ్లీ పోటీచేయకుండా నిషేధం విధించేలా అభిశంసన తీర్మానం చేయాలని ఆలోచిస్తున్నారు. 




‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>