SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsee8934b4-7ccb-418e-8f80-f1c6789af907-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsee8934b4-7ccb-418e-8f80-f1c6789af907-415x250-IndiaHerald.jpgఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయం పై తీవ్రంగా మండిపడ్డాడు.ట్విటర్ ద్వారా స్పందిస్తూ "వారి జాత్యహంకారానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో విచారకరం అన్నారు. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.తాను సైతం జాత్యహంకార కామెంట్స్ ఎదుర్కొన్నానని" కోహ్లీ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు పూర్తిగా రౌడీల్లా ప్రవర్తsports news;virat kohli;australia;police;twitter;king;audience;king 1;letterమరోసారి సిరాజ్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు...మండిపడ్డ కింగ్ కోహ్లీ !!మరోసారి సిరాజ్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు...మండిపడ్డ కింగ్ కోహ్లీ !!sports news;virat kohli;australia;police;twitter;king;audience;king 1;letterSun, 10 Jan 2021 22:31:38 GMTఅనుభవం ఎదురైంది బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ లో శనివారం టీమిండియా ఆటగాళ్లు అయిన మహ్మద్ సిరాజ్,బుమ్రా లపై ఆస్ట్రేలియన్ అభిమానులు " మంకీ " జాతి వివక్ష మాటలతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్రికెట్‌ ఆస్ట్రేలియా బీసీసీఐని క్షమాపణ కోరింది. మరోవైపు ఐసీసీ కూడా దీనిని సీరియస్‌గా భావించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. ఇదంతా జరిగి ఒకరోజు గడవక ముందే మరోసారి సిరాజ్‌పై మరికొందరు ఆకతాయిలు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

నాలుగోరోజు ఆదివారం జరిగిన ఆటలో భాగంగా రెండో సెషన్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు 'బ్రౌన్‌ డాగ్‌, బిగ్‌ మంకీ' అంటూ కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎంపైర్లు కాసేపు ఆటను నిలిపివేసి పోలీసులను రంగం లోకి దింపారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా ఆడియన్స్ చేస్తున్న ఈ వర్ణ వివక్ష వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా క్రికెటర్లపై జాతి వివక్ష కామెంట్లు చేసే ప్రేక్షకులను స్టేడియానికి రాకుండా జీవితకాలం నిషేధం విధించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 

ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ, టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయం పై తీవ్రంగా మండిపడ్డాడు.ట్విటర్ ద్వారా స్పందిస్తూ "వారి జాత్యహంకారానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో విచారకరం అన్నారు. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.తాను సైతం జాత్యహంకార కామెంట్స్ ఎదుర్కొన్నానని" కోహ్లీ చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు పూర్తిగా రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ విరాట్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 
" style="height: 277px;">




ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>