PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya8d370cd6-fc37-4403-ac6d-83f06943666b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya8d370cd6-fc37-4403-ac6d-83f06943666b-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన అఖిలప్రియకు బెయిల్ దొరకలేదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెను హైదరాబాద్‌లోని చంచల్ గూడ జైలు తరలించారు. అందులోని మహిళా జైల్లో ఆమె ఇప్పుడు ఓ సాధారణ ఖైదీగా ఉన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియకు చంచల్‌గూడా జైలు అధికారులు ఖైదీ నెంబర్‌ 1509 గా కేటాయించారు. అయితే ఆమెకు ఆరోగ్యం బాగా లేదనన్న కారణాలతో ఆమెను బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తakhilapriya;andhra pradesh;police;bhuma akhila priya;court;bengaluru 1;minister;husband;khaidi.;secunderabad;bowenpally;khaidi newషాకింగ్‌: మాజీ మంత్రి అఖిలప్రియకు ఆ వ్యాధి ఉందా..?షాకింగ్‌: మాజీ మంత్రి అఖిలప్రియకు ఆ వ్యాధి ఉందా..?akhilapriya;andhra pradesh;police;bhuma akhila priya;court;bengaluru 1;minister;husband;khaidi.;secunderabad;bowenpally;khaidi newSun, 10 Jan 2021 09:22:38 GMTమంత్రి భూమా అఖిలప్రియకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన అఖిలప్రియకు బెయిల్ దొరకలేదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెను హైదరాబాద్‌లోని చంచల్ గూడ  జైలు తరలించారు. అందులోని మహిళా  జైల్లో ఆమె ఇప్పుడు ఓ   సాధారణ  ఖైదీగా ఉన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియకు చంచల్‌గూడా జైలు అధికారులు ఖైదీ నెంబర్‌ 1509 గా కేటాయించారు.

అయితే ఆమెకు ఆరోగ్యం బాగా లేదనన్న కారణాలతో ఆమెను బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. అఖిలప్రియ తరఫు న్యాయవాదులు శుక్రవారం రాత్రి ఆమెను చంచల్‌గూడ జైల్లో కలిశారు. అనారోగ్య సమస్యలున్నాయని ఆమె న్యాయవాదులకు వివరించారు. ఈ విషయాలను వారు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శనివారం ఆమే స్వయంగా తన పరిస్థితిని జైలు అధికారులకు వివరించారు. శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించారు.

జైలు అధికారులు అఖిల ప్రియ ఆరోగ్య నివేదికను ఇవాళ సికింద్రాబాద్‌ కోర్టులో సమర్పిస్తారు.  తాను పదేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నానని అఖిలప్రియ ఉస్మానియా వైద్యులకు వివరించారట. అందుకే వైద్య పరీక్షల అనంతరం న్యూరో ఫిజీషియన్‌ వద్దకు వెళ్లాల్సిందిగా ఆమెకు వైద్యులు సూచించారట. మరోవైపు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల కిడ్నాప్‌ కేసులో  కీలక వ్యక్తి అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ కోసం పోలీసులు వెదుకుతున్నారు.

బోయిన్‌పల్లి పోలీసులు భార్గవ రామ్‌ కోసం మూడు రాష్ట్రాలకు వెళ్లారట. అయితే భార్గవ రామ్‌ బెంగళూరులో కానీ.. పుణెలో కానీ ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అందుకే పోలీసు ప్రత్యేక బృందాలు ఆ రాష్ట్రాలకు వెళ్లాయి. అలాగే ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తి గుంటూరు శ్రీను కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ రామ్‌ దొరికితే కేసు దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి.




భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>