PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-palani-swami975fd2a2-cf61-422b-8833-b3f56143e712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-palani-swami975fd2a2-cf61-422b-8833-b3f56143e712-415x250-IndiaHerald.jpgఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ పథకం వర్తించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతూ ఉపకారవేతనాలు పొందుతున్న విద్యార్థులు ఈ ఉచిత డేటా పొందవచ్చని సీఎం పళనిసామి తెలిపారు.cm palani swami;palani;january;chief minister;survey;tamilnadu;letter;collegeతమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్cm palani swami;palani;january;chief minister;survey;tamilnadu;letter;collegeSun, 10 Jan 2021 20:42:51 GMTముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మెజార్జీ సర్వే సంస్థలు చెబుతున్నారు. దీంతో  మరోసారి విజయం సాధించేందుకు అన్నాడీఎంకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రజలను ఆకట్టుకునే మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే కొత్త స్కీమ్ ప్రకటించారు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి.

     రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ పథకం వర్తించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు, ప్రైవేటు కాలేజీల్లో చదువుతూ ఉపకారవేతనాలు పొందుతున్న విద్యార్థులు ఈ ఉచిత డేటా పొందవచ్చని సీఎం పళనిసామి  తెలిపారు.ఉచిత డేటాకు సంబంధించిన రీచార్జి కార్డులను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా పంపిణీ చేస్తామని వివరించారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఉచిత 2 జీబీ డేటా పథకంతో  9 లక్షల మందికి పైగా కాలేజీ విద్యార్థులు లబ్ది పొందుతారని తెలుస్తోంది.

    కరోనా వ్యాప్తి ప్రభావంతో ప్రపంచమంతా మారిపోయింది. విద్యావ్యవస్థ ఆన్ లైన్ బాట పట్టింది. ఆన్ లైన్ అన్న తర్వాత ఇంటర్నెట్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ అందిస్తోంది.


అమ్మమ్మో ఎంత పనిచేసింది.. సర్వే పేరుతో అల్లుడినే కిడ్నాప్ చేయించిన మేనత్త

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>