PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-chases-rtc-bus-and-stops-it-with-his-carc0bea0e4-e51e-4a6c-9a30-58df192f94cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-chases-rtc-bus-and-stops-it-with-his-carc0bea0e4-e51e-4a6c-9a30-58df192f94cb-415x250-IndiaHerald.jpgసినిమాల్లో కనిపించే ఓ ఛేజింగ్ సీన్ కర్ణాటకలో పట్ట పగలే కనబడింది. అయితే ఈ ఛేజింగ్ చేసింది ఆషా మాషీ వ్యక్తులు కాదు. సాక్షాత్తూ విద్యా శాఖ మంత్రి. ఆయనే స్వయంగా తన కారుతో ఓ ఆర్‌టీసీ బస్సును వెంబడించిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగం సంచలనం సృష్టించింది. అయితే ఆయన చేసిన ఈ పనికి ఓ గొప్ప కారణమే ఉంది.minister;kumaar;suresh;karnataka - bengaluru;rtc;bus;car;driver;minister;local languageసినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..minister;kumaar;suresh;karnataka - bengaluru;rtc;bus;car;driver;minister;local languageSun, 10 Jan 2021 22:34:53 GMTబెంగళూరు: సినిమాల్లో కనిపించే ఓ ఛేజింగ్ సీన్ కర్ణాటకలో పట్ట పగలే కనబడింది. అయితే ఈ ఛేజింగ్ చేసింది ఆషా మాషీ వ్యక్తులు కాదు. సాక్షాత్తూ విద్యా శాఖ మంత్రి. ఆయనే స్వయంగా తన కారుతో ఓ ఆర్‌టీసీ బస్సును వెంబడించిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగం సంచలనం సృష్టించింది. అయితే ఆయన చేసిన ఈ పనికి ఓ గొప్ప కారణమే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఇటీవలే ఆఫ్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు పాఠశాలలకు హాజరు అవుతున్నారు. అయితే.. కొన్ని రూట్లలో కేఎస్‌ఆర్టీసీ బస్సులు విద్యార్థులు వేచి చూస్తూ కనిపిస్తున్నా ఆగడం లేదు. దీంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. అధికారులకు విద్యార్థులు చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో.. కర్ణాటక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి తుమకూరు వెళ్తున్నారు.

ఇలా వెళ్తుండగా కొరటగెరె ప్రాంతం సమీపంలో కొందరు విద్యార్థులు బస్టాప్ దగ్గర నిల్చుని ఉండటాన్ని మంత్రి చూశారు. అప్పుడే మంత్రి కారును దాటుకుంటూ ఓ ఆర్టీసీ బస్సు అటుగా వెళ్లింది. విద్యార్థులు బస్సు కోసం చేస్తున్న సైగలను చూసి కూడా ఆ డ్రైవర్.. బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. దీన్ని కళ్లారా చూసిన మంత్రి సురేష్ ఆ బస్సును వెంబడించాలని కారు డ్రైవర్‌ను ఆదేశించారు. కారుతో బస్సును ఛేజ్ చేసి,  బస్సును అడ్డగించారు. ఆ తర్వాత సదరు బస్సు డ్రైవర్‌పై, కండక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కోసం తప్పనిసరిగా బస్సు ఆపాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆదేశించారు. ఈ ఘటన.. కేఎస్‌ఆర్‌టీసీ దృష్టికి కూడా వెళ్లింది. ఈ ఘటనపై స్థానిక డివిజన్ కార్యాలయం దర్యాప్తు చేస్తోందని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని కేఎస్‌ఆర్‌టీసీ ట్వీట్ చేసింది.


ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>