PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయంగా జగన్ ను ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో చేస్తున్నారు. ఇదేవిధంగా కనుక చంద్రబాబునాయుడు ఇబ్బంది పెడితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి రాjagan, ycp, ap;cbn;kumaar;jagan;andhra pradesh;chief minister;tdp;local language;central government;ycp;party;coronavirusజగన్ ఢిల్లీలోనే తేల్చుకుంటారా...?జగన్ ఢిల్లీలోనే తేల్చుకుంటారా...?jagan, ycp, ap;cbn;kumaar;jagan;andhra pradesh;chief minister;tdp;local language;central government;ycp;party;coronavirusSun, 10 Jan 2021 19:06:17 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయంగా జగన్ ను ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో చేస్తున్నారు. ఇదేవిధంగా కనుక చంద్రబాబునాయుడు ఇబ్బంది పెడితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారాన్ని తేల్చుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపాలి అనుకుంటే ఎన్నికల సంఘాన్ని ఆపే అవకాశాలు ఉంటాయి అనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగా ముఖ్యమంత్రి జగన్ పైకి చెప్పలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మరోసారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

ఎన్నికల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి కూడా వస్తుంది అని స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ అనేది ఏమాత్రం అదుపులోకి రాలేదని కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఉద్యోగుల ప్రాణాలకే ప్రమాదమని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి... లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన పార్టీ సీనియర్ నేతలతో న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది చూడాలి.


భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>