PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న రాజకీయం టిఆర్ఎస్ పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేయడానికి బండి సంజయ్ ఈ మధ్య కాలంలో వరుసగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీద బండి సంజయ్ గురి పెట్టారు. ఇప్పుడు అక్కడున్న నేతల విషయంలో కాస్త సీరియస్ గా ఫోకస్ చేసారని సమాచారం. ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారో... వారందరితో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. ప్రధానంbandi sanjay;kcr;murali;srihari;surekha vani;bharatiya janata party;warangal;congress;district;minister;husband;party;rekha vedavyasబండి దెబ్బ మామూలుగా ఉండదు... ఆ ఇద్దరినీ గురి పెట్టారా...?బండి దెబ్బ మామూలుగా ఉండదు... ఆ ఇద్దరినీ గురి పెట్టారా...?bandi sanjay;kcr;murali;srihari;surekha vani;bharatiya janata party;warangal;congress;district;minister;husband;party;rekha vedavyasSun, 10 Jan 2021 11:00:00 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న రాజకీయం టిఆర్ఎస్ పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేయడానికి బండి సంజయ్ ఈ మధ్య కాలంలో వరుసగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీద బండి సంజయ్ గురి పెట్టారు. ఇప్పుడు అక్కడున్న నేతల విషయంలో కాస్త సీరియస్ గా ఫోకస్ చేసారని సమాచారం. ఎవరైతే టిఆర్ఎస్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారో...

వారందరితో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి కోసం ఆయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కడియం శ్రీహరికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కనుక పార్టీ మారితే కచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మంచి లాభాలు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి కొండా సురేఖతో కూడా ఆయన చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల ఆమె భర్త కొండా మురళి తో ఆయన మాట్లాడటానికి ప్రయత్నం చేసిన కొండా మురళి అందుబాటులోకి రాకపోవడంతో బండి వెనక్కు తగ్గారు.

అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆమెకు బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరిగింది. అయితే కొండా సురేఖకు బీజేపీలోనే ఆ పదవి ఆఫర్ చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి అనే మాట వాస్తవం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని కొండా సురేఖ వీడితే వరంగల్ జిల్లాలో భారీగా దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. కడియం శ్రీహరి కూడా పార్టీ మారితే టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>