PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest492ee901-6e2e-460e-b479-c824242e680c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest492ee901-6e2e-460e-b479-c824242e680c-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఆందోళన చేస్తూనే కొందరు రైతులు చనిపోాగా.. తాజా మరో అన్నదాత అసువులు బాశాడు. సింధు సరిహద్దు వద్ద రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల అమరీందర్ సింగ్ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన సహచర రైతులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమరీందర్ మృతి చెందాడు.farmers protest;modi;priya;hari;hari music;priyanka;delhi;amarinder singh;haryana - chandigarh;narendra modi;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;government;job;central government;punjab;narendraఢిల్లీ నిరసనలో విషం తాగి రైతు మృతి!ఢిల్లీ నిరసనలో విషం తాగి రైతు మృతి!farmers protest;modi;priya;hari;hari music;priyanka;delhi;amarinder singh;haryana - chandigarh;narendra modi;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;government;job;central government;punjab;narendraSun, 10 Jan 2021 11:03:22 GMTమోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గజ గజ వణికిస్తున్న చలిలోనూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. పోరాటంలో ప్రాణాలు పోతున్నా లెక్క చేయడం లేదు. ఇప్పటికే ఆందోళన చేస్తూనే కొందరు రైతులు చనిపోాగా.. తాజా మరో అన్నదాత అసువులు బాశాడు. సింధు సరిహద్దు వద్ద  రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల అమరీందర్ సింగ్ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన సహచర రైతులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమరీందర్ మృతి చెందాడు.

       పంజాబ్ రైతు అమరీందర్ సింగ్ ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. రైతు సమస్యలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మృతి బాధాకరమన్నారు.  ఇంతటి ఫాసిట్ట్ ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఫైరయ్యారు ప్రియాంక గాంధీ. ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటి వరకు 57 మంది మరణించారని రైతు సంఘాలు చెబుతున్నాయి. పదుల సంఖ్యలో రైతులు అనారోగ్యం పాలయ్యారు.రైతుల ప్రాణాలు పోతున్నా సమస్య పరిష్కారానికి కేంద్రం ముందుకు రావడం లేదనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి.

        కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమం నెలన్నన దాటింది. ప్రభుత్వంతో ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని విరమించబోమని రైతు సంఘాలు చెబుతుండగా, సవరణలకు తప్ప చట్టాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.ఈనెల 15న మరోసారి రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపనుంది.




ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>