MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlaa7d330b6-9da6-4856-9ca1-997ecf8bfad0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mlaa7d330b6-9da6-4856-9ca1-997ecf8bfad0-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నంలో టీడీపీకి చాలానే కంచుకోటలు ఉన్నాయి. అలాంటి కంచుకోటల్లో పాయకరావుపేట కూడా ఒకటి. 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 7 సార్లు విజయం సాధిస్తే, కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ ఒకసారి విజయం సాధించింది. అయితే కాంగ్రెస్, వైసీపీ నుంచి గెలిచిన నాయకుడు ఒక్కరే. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గొల్ల బాబూరావు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. మధ్యలో 2012 ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. ysrcp mla;anitha singer;raaga;tara;jagan;congress;2019;vishakapatnam;government;mla;minister;cheque;aqua;tdp;ycp;kovvur;payakaraopeta;petta;partyహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సీనియర్ ఎమ్మెల్యేకు అనిత టఫ్ ఫైట్ ఇస్తున్నారా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సీనియర్ ఎమ్మెల్యేకు అనిత టఫ్ ఫైట్ ఇస్తున్నారా?ysrcp mla;anitha singer;raaga;tara;jagan;congress;2019;vishakapatnam;government;mla;minister;cheque;aqua;tdp;ycp;kovvur;payakaraopeta;petta;partySun, 10 Jan 2021 05:00:00 GMTపాయకరావుపేట కూడా ఒకటి. 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 7 సార్లు విజయం సాధిస్తే, కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ ఒకసారి విజయం సాధించింది. అయితే కాంగ్రెస్, వైసీపీ నుంచి గెలిచిన నాయకుడు ఒక్కరే. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గొల్ల బాబూరావు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. మధ్యలో 2012 ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు.

ప్రస్తుతం వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావు, నియోజకవర్గంలో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. అయితే మొదట్లో ఈయన సొంత పార్టీపైనే అసంతృప్తి రాగం అందుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా దళితుడినని తనను హేళన చేస్తున్నారని, అవమానిస్తున్నారని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలు తనను చులకనగా చూస్తున్నారని మాట్లాడారు. ఇక తర్వాత తర్వాత బాబూరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపేశారు. నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

అలాగే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వస్తుందేమో అని ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్లస్ అవుతాయి. అయితే ఇక్కడ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ తాగునీరు ప్రధాన సమస్య. ఇక్కడ తాండవ నది ప్రవహిస్తున్నా, ప్రజానీకానికి సాగు, తాగు నీటి సరఫరా సక్రమంగా లేదు. గిరిజన ప్రాంతాలలో తారు రోడ్లు లేవు. వరాహ నదిపై జలాశయం నిర్మించాలసిన అవసరముంది. ఏటి కొప్పాక చక్కెర కర్మాగారం ఉన్నా ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ టీడీపీ తరుపున వంగలపూడి అనిత ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. 2014లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత, 2019 ఎన్నికల్లో కొవ్వూరులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే చంద్రబాబు మళ్ళీ అనితని పాయకరావుపేట తీసుకొచ్చి, ఇన్‌చార్జ్‌గా పెట్టారు. దానికి తోడు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలుగా అనిత దూసుకెళుతున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, మరోవైపు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం దిశగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో బాబూరావుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి చూడాలి జగన్ ఇమేజ్‌తో దూసుకెళుతున్న బాబూరావుకు అనిత ఏ మేర చెక్ పెడుతుందో.




కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>