Technologyyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/isrob1d613d7-82f0-4134-9875-f21a98f163fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/isrob1d613d7-82f0-4134-9875-f21a98f163fc-415x250-IndiaHerald.jpgగగన్‌యాన్ మిషన్ ద్వారా 2022లో ఇస్రో ఓ అద్భుతం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో తొలిసారిగా మానవ సహిత వ్యోమ నౌకను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. దీనిజాసం ఇప్పటికే ఓ ప్రతిష్ఠాత్మక..isro;technology;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;russia;france;moscow;history;isro;februaryఅంతరిక్షంలోకి మానవ సహిత గగన్‌యాన్.. చరిత్ర సృష్టించనున్న ఇస్రోఅంతరిక్షంలోకి మానవ సహిత గగన్‌యాన్.. చరిత్ర సృష్టించనున్న ఇస్రోisro;technology;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;russia;france;moscow;history;isro;februarySun, 10 Jan 2021 21:15:00 GMTఇస్రో ఓ అద్భుతం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో తొలిసారిగా మానవ సహిత వ్యోమ నౌకను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. దీనిజాసం ఇప్పటికే ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపించేందుకు ఇస్రో రెడీ అవుతోంది.

దీనికోసం వ్యోమగాములు శిక్షణ కూడా అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించాలంటే శిక్షణ ఎంతో కీలకం. ప్రయోగ సమయంలోనూ, ఆ తర్వాత.. వ్యోమగాముల ఆరోగ్యానికి సంబంధించి ఫ్లైట్ సర్జన్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబోయే వ్యోమగాములతో కలిసి వీరు కూడా శిక్షణ తీసుకోనున్నారు. ఏ మేరకు ఓ అధికారి వెల్లడించారు.

ఇందులో భాగంగా ఇద్దరు ఫ్లైట్ సర్జన్లను శిక్షణ కోసం త్వరలో రష్యా పంపించనుంది. భారత వాయుసేనకు చెందిన ఈ వైద్యులు ఏరోస్పేస్ మెడిసిన్‌లో నిపుణులు. ఫ్లైట్ సర్జన్లు ఇద్దరు త్వరలో రష్యా వెళ్లి అక్కడి ఫ్లైట్ సర్జన్ల వద్ద శిక్షణ తీసుకుంటారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.


భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం కోసం భారత వాయసేనకు చెందిన నలుగురు టెస్ట్ పైలట్లను ఎంపిక చేశారు. ఈ నలుగురు గతేడాది ఫిబ్రవరి నుంచి మాస్కో సమీపంలోని యూరీలో గగారిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. నిజానికి వారు ఈ మార్చిలో దేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే ఆ దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో శిక్షణ పూర్తి కాలేదు. దీంతో ఇప్పుడు శిక్షణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఇక స్పేస్ మెడిసన్‌లో ఫ్రాన్స్ వద్ద పూర్తిస్థాయి టెక్నాలజీ, నైపుణ్యం గల శాస్త్రజ్ఞులు ఉన్నారు. మెడెస్ స్పేస్ క్లినిక్ కూడా ఉంది. ఇది నేషనల్ సెంటర్ ఫర్ స్పేస్ స్టడీస్(సీఎన్‌సీఎస్)కు అనుబంధం సంస్థ. ఈ సంస్థకు భారత్ కు చెందిన ఫ్లైట్ సర్జన్లను కూడా ఇస్రో పంపనుంది. ఫిజీషియన్లు, ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చేందుకు 2018లో ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫ్లైట్ సర్జన్ బ్రిగిట్ గోడార్డ్ భారత్‌ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు భారత సర్జన్లు అక్కడికి వెళ్లనున్నారు.

ఇస్రో అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదికల్లా మన మానవ సహిత గగన్‌యాన్ ఆస్ట్రోనాట్ లతో కలిసి అంతరికాహంలోకి దూసుకెళ్తుంది.




ఆకట్టుకుంటున్న ఆడి ఏ 4

స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>