PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-election-commissioner-bjp-somu-jagan6001ffeb-f8cc-4855-b04f-57b740ae7528-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-election-commissioner-bjp-somu-jagan6001ffeb-f8cc-4855-b04f-57b740ae7528-415x250-IndiaHerald.jpgఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం మాత్రం తన ఏర్పాట్లను మరింత ముమ్మరం చేస్తోంది. ఇక మరోవైపు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, విధుల్లో పాల్గొనేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ స్పందించారు. అందరి సహకారంతో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం 2 పేజీల ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులపై ప్రశంసల జల్లు కురిపించారు. nimmagadda ramesh;prakruti;jagan;andhra pradesh;high court;panchayati;local language;ycp;chief commissioner of elections;coronavirusప్రభుత్వ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించిన ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్....ప్రభుత్వ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించిన ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్....nimmagadda ramesh;prakruti;jagan;andhra pradesh;high court;panchayati;local language;ycp;chief commissioner of elections;coronavirusSun, 10 Jan 2021 22:50:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చలు రేపుతోంది. సీఎం జగన్ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం మాత్రం తన ఏర్పాట్లను మరింత ముమ్మరం చేస్తోంది. ఇక మరోవైపు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, విధుల్లో పాల్గొనేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్  స్పందించారు. అందరి సహకారంతో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం 2 పేజీల ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులపై ప్రశంసల జల్లు కురిపించారు. విధుల నిర్వహణలో మీకెవ్వరూ సాటిరారంటూ పొగడ్తలు గుప్పించారు. పోలింగ్‌ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనా టీకాలో పోలింగ్‌ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్‌షీల్డ్‌లు సరఫరా చేస్తామన్నారు. ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.



రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తనకు వ్యతిరేకంగా గళం విప్పినా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మాత్రం వారిపై ప్రశంసలు కురిపించారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కష్టపడి పని చేసిన గుర్తింపు ఏపీ ఉద్యోగులకు ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని, దీనికి అందరూ కలిసి రావాలని కోరారు. ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు ఎస్‌ఈసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పార్టీలు కోరుతున్నాయని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతాయన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని ఆయన గుర్తు చేశారు. కాబట్టి అందరూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు.


అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>