PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-corona-vaccinebeaa1fdd-ac89-4f73-9521-1739458de091-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-corona-vaccinebeaa1fdd-ac89-4f73-9521-1739458de091-415x250-IndiaHerald.jpgకరోనా టీకా వచ్చేస్తోందని మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. నిజంగానే జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం అవుతోంది. దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ముహూర్తాన్ని ఏకంగా ప్రధాని మోడీయే ప్రకటించేశారు. దేశంలో చేపట్టే అతి పెద్ద కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే వ్యmodi-corona-vaccine;modi;india;narendra modi;january;prime minister;nijam;narendraకరోనా టీకా వచ్చిందని సంబరం వద్దు.. అసలు విషయం తెలిస్తే మీకు నోట మాట రాదు..!?కరోనా టీకా వచ్చిందని సంబరం వద్దు.. అసలు విషయం తెలిస్తే మీకు నోట మాట రాదు..!?modi-corona-vaccine;modi;india;narendra modi;january;prime minister;nijam;narendraSun, 10 Jan 2021 00:00:00 GMTజనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం అవుతోంది. దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ముహూర్తాన్ని ఏకంగా ప్రధాని మోడీయే ప్రకటించేశారు. దేశంలో చేపట్టే అతి పెద్ద కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై నిర్వహించిన దేశవ్యాప్త డ్రైరన్‌లో పరిశీలనకు వచ్చిన అంశాలు, ఏయే అంశాలపై మెరుగుపడాలనే అంశంపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రధాని చర్చించారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. చివరకు జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు.

మరి అంతా బాగానే ఉంది కదా.. ఇంకేంటి అనుకుంటున్నారా.. ఈనెల 16 నుంచి దేశవ్యాప్తంగా చేపట్టిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదటివిడతలో.. 3 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు. ఇందులో కరోనా వారియర్స్‌కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ఆతర్వాత యాభై ఏళ్లు పైబడినవారికి యాభై ఏళ్లలోపు అనారోగ్య బాధితులకు ప్రాధాన్యముంటుంది. అంటే మొత్తం 130 కోట్ల భారతీయుల్లో ఇప్పుడు వ్యాక్సిన్ వేసేది 30కోట్ల మందికే.. మరి మిగిలినవారికి వ్యాక్సిన్ అందాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. అదీ అసలు సంగతి.

కరోనా సంక్షోభ సమయంలో తన సామర్థ్యాన్ని భారత్‌ మరోసారి ప్రపంచానికి చాటిందని మోడీ అంటున్నారు. పీపీఈ కిట్లు, మాస్కులు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లను భారత్‌ ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునేది కానీ ఇప్పుడు సొంతంగా తయారు చేస్తోందని చెప్పారు. ఇప్పుడు మానవాళిని రక్షించేందుకు ఒకటి కాదు రెండు భారత్‌ తయారీ కరోనా నిరోధక వ్యాక్సిన్లతో భారత్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. అంతే కాదు.. ప్రపంచం భారత తయారీ కరోనా వ్యాక్సిన్ల కోసం వేచి ఉండడమే కాకుండా... ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారత్ ఎలా నిర్వహిస్తుందా అని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. అంతా నిజమే అయినా సామాన్యుడికి వ్యాక్సిన్ అందడానికి ఇంకా సమయం పడుతుందన్నదీ నిజమే.




వకీల్ సాబ్ డైలాగ్స్‌తోనే పడగొట్టేస్తాడా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>