MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf2-trailer7daf034a-42fc-4b13-8c81-0fe8736d2fe0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf2-trailer7daf034a-42fc-4b13-8c81-0fe8736d2fe0-415x250-IndiaHerald.jpgకేజీయఫ్ ఛాప్టర్ 2 టీజర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు బద్దలు కొడుతోంది. రిలీజైన 24 గంటల్లోనే 10 కోట్ల (100 మిలియన్లు) లైక్ లు, 50 లక్షల (5 మిలియన్లు) వ్యూస్ తో ఈ టీజర్ సంచలనం సృష్టించింది. ఈ దూకుడు ఇంకా అలానే కొనసాగుతోంది. ఈ పాపులారిటీ చూస్తుంటే కేజీయఫ్ ఛాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకు తెర లేపుతుందో? అంటూ అప్పుడే సినీ ఇండస్ట్రీలో విశ్లేషణలు మొదలైపోయాయి.kgf;sanjay dutt;maya;prasanth;prashanth neel;rajamouli;yash;rrr movie;cinema;bahubali;hindi;industry;director;tsunami;prasanth neel;prashant kishorకేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?kgf;sanjay dutt;maya;prasanth;prashanth neel;rajamouli;yash;rrr movie;cinema;bahubali;hindi;industry;director;tsunami;prasanth neel;prashant kishorSun, 10 Jan 2021 23:02:57 GMT
ఇప్పటికిప్పుడు కేజీయఫ్ 2 థియేటర్లలోకి వస్తే సెన్సేషనల్ హిట్ ఖాయం అన్నంత రేంజ్‌లో సినిమా టీజర్ ని అందించారు ప్రశాంత్ నీల్ అండ్ టీం. రాకింగ్ స్టార్ యష్ కూడా మరో సారి రాకింగ్ పెర్ఫామెన్స్ తో భారీ యాక్షన్ తో కట్టి పడేయడానికి రెడీ అయిపోయినట్లు టీజర్ చూస్తేనే తెలిసిపోతోంది. మరోవైపు అధీరా (సంజయ్ దత్) లుక్ వల్ల అటు హిందీ బెల్టులోనూ ఈ టీజర్ కేకలు పుట్టిస్తోంది.

ఒకవేళ కేజీయఫ్ 2 రిలీజైతే రాజమౌళి తెరకెక్కించిన రికార్డుల రారాజు `బాహుబలి: ది కంక్లూజన్` రికార్డులు బద్దలు కొట్టేస్తుందా? అలాగే అదే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కి సవాల్ విసురుతుందా? అన్న చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. కేజీయఫ్ 2 టీజర్ వచ్చినట్లే ప్రజలు థియేటర్లకు కూడా క్యూ కడితే అదేమీ అంత కష్టం కాదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అంటే ఈ సినిమా టీజర్ ఎంత మాయ చేసిందో అర్థం అయిపోతోంది. సినిమా ట్రైలర్ తో వేడిని మరింతగా పెంచేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. అదే గనుక జరిగితే రాజమౌళి మరింత కష్టపడాల్సిందే అని, ఆర్ఆర్ఆర్‌ను మరింత గొప్పగా తెరకెక్కించాల్సి ఉంటుందని కొందరు అంటున్నారు. మరి ఈ రెంటిలో ఏది ఇండస్ట్రీ హిట్‌గా రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు.


అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>