PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-sharmila60f00755-48da-4fc3-8733-c5b356c72047-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-sharmila60f00755-48da-4fc3-8733-c5b356c72047-415x250-IndiaHerald.jpgఇక గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ఒంగోలు నుంచి ఎంపీగా బ‌రిలో ఉంటార‌న్న ప్ర‌చారం జ‌రిగినా జ‌గ‌న్ మాత్రం ఆమెకు సీటు ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత చాలా సార్లు ష‌ర్మిల రాజ్య‌స‌భ‌కు వెళ‌తార‌న్న ప్ర‌చారం అయితే జ‌రిగింది. అయితే ఆమెకు జ‌గ‌న్ ఏ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ తిరుగులేని శ‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సోద‌రిని ఎంపీగా నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ దాదాపు నిర్ణ‌యం తీసేసుకున్న‌ట్టు తెలుస్తోంది. త‌న త‌ల్లి ఓడిపోయిన విశాఖ నుంచే త‌న సోద‌రి ష‌ర్మిల‌ను వ‌చ్చేjagan sharmila;tiru;bharatiya janata party;andhra pradesh;devineni avinash;mp;vishakapatnam;mla;letter;tdp;ycp;partyష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!jagan sharmila;tiru;bharatiya janata party;andhra pradesh;devineni avinash;mp;vishakapatnam;mla;letter;tdp;ycp;partySun, 10 Jan 2021 11:41:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్ కోసం త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, సోద‌రి వైఎస్‌. ష‌ర్మిల ఎంతో చేశార‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో అప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప ఎంపీగా ఉన్న జ‌గ‌న్ ఆ సీటు నుంచి త‌న త‌ల్లిని పోటీ చేయించాల‌ని అనుకున్నారు. అయితే అక్క‌డ త‌న క‌జిన్ అయిన అవినాష్ రెడ్డికి సీటు ఇచ్చిన జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని విశాఖ ఎంపీగా పోటీ చేయించ‌గా ఆమె ఓడిపోయారు. వైఎస్ ఫ్యామిలీకి అదే తొలి ఓట‌మి. ఇక ఆ ఎన్నిక‌ల్లో సోద‌రి ష‌ర్మిల‌ను ఖ‌మ్మం నుంచి బ‌రిలోకి దింపుతార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే ఆమె మాత్రం ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.

ఇక గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ఒంగోలు నుంచి ఎంపీగా బ‌రిలో ఉంటార‌న్న ప్ర‌చారం జ‌రిగినా జ‌గ‌న్ మాత్రం ఆమెకు సీటు ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత చాలా సార్లు ష‌ర్మిల రాజ్య‌స‌భ‌కు వెళ‌తార‌న్న ప్ర‌చారం అయితే జ‌రిగింది. అయితే ఆమెకు జ‌గ‌న్ ఏ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ తిరుగులేని శ‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సోద‌రిని ఎంపీగా నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ దాదాపు నిర్ణ‌యం తీసేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

త‌న త‌ల్లి ఓడిపోయిన విశాఖ నుంచే త‌న సోద‌రి ష‌ర్మిల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా బ‌రిలో దింపుతార‌ట‌. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎంపీగా ఉన్న ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఎన్నిక‌ల‌కు ఎనిమిది నెల‌ల ముందే పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు. విశాఖ ఎంపీలుగా గెలిచిన వారు ఎంతో మంది త‌మ మార్క్ చూపించినా స‌త్య‌నారాయ‌ణ మాత్రం ఈ విష‌యంలో ఫెయిల్ అయ్యార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. పైగా ఆయ‌న సామాజిక వ‌ర్గం ప‌రంగా చాలా మంది టీడీపీ నేత‌ల‌తో పాటు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడితో స‌న్నిహితంగా ఉంటున్నార‌న్న టాక్ ఉంది.

ఇక బీజేపీ వాళ్ల‌తో ట‌చ్‌లో ఉండ‌డంతో పాటు త‌న ప‌ద‌విని త‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల కోస‌మే ఎక్కువ వాడుతున్నార‌న్న టాక్ ఆయ‌న‌పై వైసీపీలోనే ఉంది. ఇక పార్టీ అధికారంలో ఉండి.. ఆయ‌న ఎంపీగా ఉన్నా కూడా అక్క‌డ విజ‌య‌సాయి పెత్త‌నం న‌డుస్తుండ‌డంతో ఆయ‌న అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సారి జ‌గ‌న్‌తో పాటు వైసీపీ పెద్ద‌ల‌కు ఎంవీవీపై అంత గురి లేద‌ని.. అక్క‌డ నుంచి ష‌ర్మిల‌ను రంగంలోకి దింపుతార‌ని టాక్ ? 


ప‌వ‌న్‌, చిరు భ‌లే చిక్కుపెట్టారే... మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డం ప‌క్కా...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>