PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-has-unexpected-support-757d6da4-6128-4b0b-95fb-f485b6e8a6c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-has-unexpected-support-757d6da4-6128-4b0b-95fb-f485b6e8a6c5-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే, మరో వైపు రాజకీయాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూ, మళ్ళీ రాష్ట్రంలో ఏమన్నా సమస్యలు ఉంటే వాటిపై పోరాటం చేయడానికి పవన్ వస్తున్నారు. మొన్నటివరకు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులని పవన్ పరామర్శించిన విషయం తెలిసిందే. తుఫాన్ వల్ల నష్టపోయిన జిల్లాల్లో పర్యటించి, రైతులకు అండగా నిలిచారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేశారు. pawan kalyan;pawan;nani;kalyan;kodali nani;godavari river;jagan;janasena;east;cinema;east godavari;government;police;local language;ycp;janasena party;partyపవన్‌కు ఊహించని సపోర్ట్...కానీ జగన్‌తో కష్టమే...పవన్‌కు ఊహించని సపోర్ట్...కానీ జగన్‌తో కష్టమే...pawan kalyan;pawan;nani;kalyan;kodali nani;godavari river;jagan;janasena;east;cinema;east godavari;government;police;local language;ycp;janasena party;partySun, 10 Jan 2021 02:00:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే, మరో వైపు రాజకీయాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటూ, మళ్ళీ రాష్ట్రంలో ఏమన్నా సమస్యలు ఉంటే వాటిపై పోరాటం చేయడానికి పవన్ వస్తున్నారు. మొన్నటివరకు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులని పవన్ పరామర్శించిన విషయం తెలిసిందే. తుఫాన్ వల్ల నష్టపోయిన జిల్లాల్లో పర్యటించి, రైతులకు అండగా నిలిచారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేశారు.

మొన్న ఈ మధ్య అయితే జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొడాలి నాని, పేర్ని నానీలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. అటు నానీల నుంచి కూడా పవన్‌కు కౌంటర్లు పడ్డాయి. అయితే ఇక్కడ పవన్ కీలకంగా చేసిన పేకాట ఆరోపణలపై వెంటనే పోలీసులు స్పందించడం, రైడ్లు చేసి పలువురుని పట్టుకోవడం చేశారు. ఇక ఆ తర్వాత పవన్ మళ్ళీ సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయారు. తాజాగా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో తొండంగిలో ఉన్న దివీస్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్ధతు తెలిపారు. అలాగే దివీస్ ఏర్పాటుని వ్యతిరేకించారు.

అయితే మొన్నటివరకు ఈ దివీస్ వ్యతిరేక ఉద్యమం తూర్పుకు పరిమితమైంది. పవన్ ఎంట్రీతో ఇది రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయిందనే చెప్పొచ్చు. ఇక ఇలా పవన్ ఏదైనా సమస్యపై పోరాటం చేస్తే అది ప్రజల్లో హైలైట్ అవుతుంది. వీటిని ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ప్రజలు పట్టించుకుంటున్నారు. అయితే పవన్ చేసే పోరాటాలకు ప్రజలు మద్ధతు తెలుపుతున్నారు గానీ, అవి మాత్రం ఓట్ల రూపంలో రావడం లేదు.

ముందు నుంచి ఇలాగే జరుగుతుంది. పవన్‌కు సొంత పార్టీ కార్యకర్తలతో పాటు న్యూట్రల్‌గా ఉండే ప్రజలు సపోర్ట్ బాగానే ఉంటుంది. కానీ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ముందు పవన్ తేలిపోతున్నారనే చెప్పొచ్చు. అందుకే ఇప్పటికీ ప్రజలు జగన్ వైపే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి పవన్ వల్ల, జగన్‌కు వచ్చే నష్టమేమీ లేదని తెలుస్తోంది.





కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>