TechnologyShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/what-s-app412e5fa0-9ba8-48bf-b7ed-cf317ada7126-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/what-s-app412e5fa0-9ba8-48bf-b7ed-cf317ada7126-415x250-IndiaHerald.jpgమీరు వాట్సాప్‌ వాడుతున్నారా... చాటింగ్‌ చేస్తున్నారా .. కొత్త రూల్స్‌ వచ్చేసాయి . కొత్త వాట్సాప్‌ నిబంధలను మీరు అంగీకరిస్తేనే చాటింగ్‌ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఆ రూల్స్‌ను అంగీకరించకపోతే మీ ఫోన్‌ నుంచి వాట్సాప్‌ ఫీచర్‌ అటోమేటిక్‌ మాయమవుతుందన్న సందేశాన్ని తరచుగా పంపిస్తున్నారు. అయితే దీనికి మీరు ఓకే అంటే మీ వ్యక్తిగత డేటా అంతా వాట్సాప్‌కు లీకయిపోతోంది.ఫిభ్రవరి 16 లోగా వాట్సాప్‌ వినియోగదారులంతా ఈ కండీషన్స్‌కు అంగీకరించాల్సిందే. ఆ తరువాత యాప్‌ అన్‌ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. కొత్త నిబంధనల ప్రకారం మwhat's app;business;smart phone;whatsapp;facebook;kanna lakshminarayanaవాట్సాప్ వాడుతున్నారా...... అయితే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్లకు వెళ్ళిపోవటం కాయం...!?వాట్సాప్ వాడుతున్నారా...... అయితే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్లకు వెళ్ళిపోవటం కాయం...!?what's app;business;smart phone;whatsapp;facebook;kanna lakshminarayanaSun, 10 Jan 2021 19:43:00 GMTఫేస్‌బుక్‌ కంపెనీలతో షేర్‌ చేస్తుంది. 2014లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది వాట్సాప్‌.

వాట్సాప్ ఇకనుంచి యూజర్స్ డేటాను సేకరిస్తుంది. యూజర్స్ వాట్సాప్ యాక్టివిటీ,వ్యక్తిగత సమాచారం,సర్వీస్,డయాగ్నోస్టిక్,పెర్ఫామెన్స్,బ్యాటరీ లెవల్,సిగ్నల్ స్ట్రెంత్,యాప్ వెర్షన్,బ్రౌజర్ ఇన్ఫర్మేషన్,మొబైల్ నెట్‌వర్క్,ఫోన్ నంబర్,ఐపీ,లాంగ్వేజ్,టైమ్ జోన్,డివైజ్ ఆపరేషన్ ఇన్ఫర్మేషన్‌ తదితర సమాచారాన్ని వాట్సాప్ సేకరిస్తుంది.అంతేకాదు, ఈ డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్ షేర్ చేసుకుంటుంది.ఎవరైనా యూజర్ తమ వాట్సాప్ ఖాతాను డిలీట్ చేసినంత మాత్రానా అందులోని డేటా తొలగించబడదు. యాప్‌లో 'డిలీట్ మై అకౌంట్ ఫీచర్' అనే ఆప్షన్‌ని ఎంచుకుంటేనే ఆ వాట్సాప్ ఖాతాలోని డేటా తొలగించబడుతుంది. ఒకవేళ ఏవైనా సాంకేతిక కారణాలతో కొన్నిసార్లు మెసేజ్‌లు అవతలివారికి వెళ్లకుండా నిలిచిపోతే... వాట్సాప్ సర్వర్స్‌లో అది 30 రోజుల వరకూ అలాగే ఉంటుంది. ఆ 30 రోజుల తర్వాత కూడా ఆ మెసేజ్‌ డెలివరీ కాకపోతే అప్పుడు అది డిలీట్ అవుతుంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రైవసీ పాలసీ పట్ల చాలామంది యూజర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్‌లో ఇక ప్రైవసీకి అవకాశం లేకుండా పోతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలా ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుండటంతో వాట్సప్ స్పందించింది. పారదర్శకంగా ఉండటానికి, బిజినెస్ ఫీచర్స్‌ను వివరించడానికి తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేశామని వాట్సప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ తెలిపారు. . ఇది బిజినెస్ కమ్యూనికేషన్ మాత్రమేనని, డేటా షేరింగ్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు లేవని, యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎప్పట్లాగే కమ్యూనికేషన్‌లో ఉండొచ్చని, వారిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.

 కొత్త ప్రైవసీ పాలసీలోని అంశాలపై యూజర్లలో ఆందోళన కొనసాగుతోంది. అందుకే వాట్సప్ బదులు ఇతర యాప్స్ ఏవైనా ఉపయోగించాలని అనుకుంటున్నారు. వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా  ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ కనిపిస్తున్నాయి.వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్ పేరు మొదట  ముందుకు వస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. వాట్సప్ లాగానే టెలిగ్రామ్‌లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. ఈ యాప్ ఉచితం. ఎం పి టి  ప్రోటోకాల్ ఉపయోగిస్తున్నాం కాబట్టి తమ యాప్ వాట్సప్ కన్నా సురక్షితమని టెలిగ్రామ్ చెబుతోంది.


భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>