MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/actress-bhaunumathi-love-storycb6c7afd-5543-4adb-b0db-d3b41c9f5437-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/actress-bhaunumathi-love-storycb6c7afd-5543-4adb-b0db-d3b41c9f5437-415x250-IndiaHerald.jpgఎక్కడైనా హీరోయిన్ హీరో చుట్టూ తిరగాలి, కానీ ఈ హీరోయిన్ మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్ చుట్టూ తిరిగేవారు. సినిమాల్లో అంటే కథకి తగ్గట్టు హీరో చుట్టూ తిరగాలి. మరి అసిస్టెంట్ డైరెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది అంటే లవ్వు. ఆ లవ్వు కారణంగానే ఒకప్పటి అందాల నటి భానుమతి, అసిస్టెంట్ డైరెక్టర్ వెంట పడ్డారట.actress bhaunumathi love story;bhanu;bhanumathi old;bharani;geetha;jeevitha rajaseskhar;prema;ramakrishna;sangeetha;marriage;december;love;director;husband;hero;heroine;fatherఅసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమ వ్యవహారం...స్లమ్ లో కష్టాలు అనుభవించి...భానుమతి జీవితంఅసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమ వ్యవహారం...స్లమ్ లో కష్టాలు అనుభవించి...భానుమతి జీవితంactress bhaunumathi love story;bhanu;bhanumathi old;bharani;geetha;jeevitha rajaseskhar;prema;ramakrishna;sangeetha;marriage;december;love;director;husband;hero;heroine;fatherSun, 10 Jan 2021 16:00:00 GMTహీరోయిన్ హీరో చుట్టూ తిరగాలి, కానీ ఈ హీరోయిన్ మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్ చుట్టూ తిరిగేవారు. సినిమాల్లో అంటే కథకి తగ్గట్టు హీరో చుట్టూ తిరగాలి. మరి అసిస్టెంట్ డైరెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది అంటే లవ్వు. ఆ లవ్వు కారణంగానే ఒకప్పటి అందాల నటి భానుమతి, అసిస్టెంట్ డైరెక్టర్ వెంట పడ్డారట. అసలు భానుమతి అంటే జనాలు పడిచచ్చేవారు. ఆమె తమవైపు చూస్తే చాలనుకునేవారు. అలాంటి ఆమె ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడ్డారు. ఆయన పేరు రామకృష్ణ. తాను చేసే కొన్ని సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు రామకృష్ణ. ఆయన ఎప్పుడూ పని తప్ప వేరే ధ్యాస లేకుండా పని చేసేవారట. ఎవరినీ పట్టించుకునేవారు కాదు. తన పనేదో తాను చేసుకుని, పనయ్యాక మాట్లాడకుండా  వెళ్లిపోయేవారు. దీంతో భానుమతికి మతి పోయింది. ఇంత డీసెంట్ గా ఉన్నాడు, ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నారట. ఎప్పుడు మాట్లాడదాం అని ప్రయత్నించినా రామకృష్ణ మాట్లాడకుండా తప్పించుకునేవారట. దీంతో భానుమతి ఈగో హర్ట్ అయ్యిందట. ఒకరోజు ఆయన ఉంటున్న స్లమ్ ఏరియాకి వెళ్లి, గల్లీలన్నీ తిరిగి, ఆయన ఇంటి అడ్రస్ పట్టుకుని మరీ వెళ్లారట. సరాసరి ఆయన ఇంట్లోకి వెళ్లి, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగేశారట. ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి కదిలేదు లేదని మొండి పట్టుదల పట్టడంతో ఆయన పెళ్లికి ఒప్పుకున్నారట. అయితే పెళ్ళయ్యాక తాను సినిమాలు మానేస్తానని భానుమతి అన్నారట.

వీళ్ళ పెళ్లి విషయం భానుమతి తండ్రికి చెప్తే ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఇంట్లో పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లిచేసుకున్నారు. ఆశీర్వాదం కోసం దంపతులిద్దరూ, భానుమతి తండ్రి దగ్గరకు వెళ్తే ఆయన పో అన్నారట. ఇక ఆమె తల్లి భానుమతి కోసం ఉంచిన బంగారు ఆభరణాలను ఇవ్వబోతుంటే, రామకృష్ణ వద్దన్నారు. మాకు నగలు, నగదు వంటి వాటి మీద ఆశ లేదని, కష్టపడి పైకొస్తామని చెప్పి అక్కడ నుంచి వచ్చేశారట. అలా భానుమతి, ఆమె భర్త రామకృష్ణతో ఒక మురికివాడలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయనకు వచ్చే ఆదాయం ఇంట్లో సరిపోయేది కాదు. మొదట్లో చాలా కష్టాలు అనుభవించారు. హీరోయిన్ గా విలాసవంతమైన జీవితాన్ని గడపాల్సిన ఆమెకు ఇలా స్లమ్ లోనే ఉండిపోవడం ఇష్టం లేదు. దీంతో ఆమె తన భర్త అనుమతితో సినిమాలు చేయడం ప్రారంభించారు. వీళ్ళ ప్రొడక్షన్ లో ఒక అబ్బాయి పుడితే భరణి అని పేరు పెట్టారు. ఆ తర్వాత భరణి స్థూడియో స్టార్ట్ చేసి అనేక చిత్రాలను నిర్మించారు. అలా రామకృష్ణ కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చి భానుమతి రామకృష్ణగా పేరు మార్చుకుని, నిర్మాతగా భర్తతో కలిసి పని చేసి పైకొచ్చారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఇక ఈమె నటిగానే కాకుండా, సింగర్ గా, సంగీత దర్శకురాలిగా, స్థూడియో అధినేతగా, నిర్మాతగా, రచయిత్రిగా, దర్శకురాలిగా కూడా తన సత్తా చాటారు. అలాంటి ఈమె 2005 డిసెంబర్ 24న చెన్నైలోని ఆమె స్వగృహంలో తనువు చాలించారు.
 




ఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>