PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp91cdefc3-4065-41f1-941c-9c791d75e57c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp91cdefc3-4065-41f1-941c-9c791d75e57c-415x250-IndiaHerald.jpgరాజకీయాలు అంటేనే అలా ఉంటాయి. ఎపుడెవరు ఎలా ఉంటారో చెప్పడం అంతకంటే కష్టం. వర్తమాన రాజకీయాలు అన్నీ కూడా చాలా చిత్రంగా సాగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పాలి. ఇక పార్టీల మధ్య కూడా భారీ పోటీ నెలకొంటోంది. tdp;cbn;bharatiya janata party;jagan;2019;cinema;vishakapatnam;mla;minister;cycle;tdp;ycp;giddi eswari;party;chitramఉత్తరాంధ్రాలో బాబుకు ఝలక్.....?ఉత్తరాంధ్రాలో బాబుకు ఝలక్.....?tdp;cbn;bharatiya janata party;jagan;2019;cinema;vishakapatnam;mla;minister;cycle;tdp;ycp;giddi eswari;party;chitramSun, 10 Jan 2021 10:30:00 GMT
ఈ నేపధ్యంలో ప్రత్యర్ధి బలం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీజేపీ అయితే ఏపీలో గట్టిగా స్థిరపడాలని నిర్ణయించుకుంది. దాని కోసం అటు వైసీపీ ఇటు టీడీపీలను టార్గెట్ గా ఎంచుకుంది. వైసీపీ అధికారంలో ఉండడంతో ఆ నాయకులు ఇప్పట్లో బయటకు రారు. అదే టీడీపీ విపక్షంలో ఉండడంతో కొంతమంది అసంతృప్తి గా ఉన్నారు. అటువంటి వారిని గుర్తించి మరీ తమ వైపునకు తిప్పుకునేందుకు కమలనాధులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులతో టీడీపీకి గట్టిగానె దెబ్బలు తగులుతాయి అంటున్నారు.

ఉత్తరాంధ్రాలోని విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సైకిల్ దిగిపోతారని అంటున్నారు. ఆమె గత కొంతకాలంగా పార్టీ తీరు పట్ల అసహనంతో  ఉన్నారని టాక్. ఆమె 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి జగన్ పార్టీలో కీలకంగా మారారు. ఆ తరువాత 2017లో ఆపరేషన్ ఆకర్ష్ లో ఆమె టీడీపీలోకి వచ్చారు. ఆమె కోరుకున్నట్లుగా మంత్రి పదవి దక్కలేదు సరికదా ఇబ్బందులే పడ్డారు. 2019 ఎన్నికలో పాడేరు నుంచి టికెట్ ఇచ్చిన కూడా ఆమె ఓడారు. ఆ తరువాత పార్టీ పదవులు కూడా ఆమెకు అధినాయకత్వం ఇవ్వలేదు అంటారు.

ఈ పరిణామాలతో విసిగిన ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరిపోవాలనుకుంటున్నారు అని తెలుస్తోంది. తొందరలోనే ఆమె పసుపు గూడు వీడి కాషాయం కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. ఇదే వరసలో మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను కూడా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ పరిణామాలతో ఉత్తరాంధ్రాలో టీడీపీకి భారీ నష్టం వాటిల్లనుందా అన్న చర్చ అయితే సాగుతోంది.






ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>