PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-target-in-tirupati-elections-d07435b9-cfca-4cdc-831c-b46497dc45d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-target-in-tirupati-elections-d07435b9-cfca-4cdc-831c-b46497dc45d5-415x250-IndiaHerald.jpgఅతి త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడంతో తిరుపతి స్థానానికి ఎన్నికలు అనివార్యమైనవి. ఇక 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో, అన్నీ పార్టీలు తిరుపతిలో పాగా వేయాలని చూస్తున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేనలు, ఇతర పార్టీలు తిరుపతి బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. jagan;tiru;bharatiya janata party;jagan;congress;2019;mp;tirupati;parliment;fort;husband;tdp;ycp;partyతిరుపతిలో జగన్ టార్గెట్ ఇదే....వారు దెబ్బ వేస్తే చెప్పలేం...తిరుపతిలో జగన్ టార్గెట్ ఇదే....వారు దెబ్బ వేస్తే చెప్పలేం...jagan;tiru;bharatiya janata party;jagan;congress;2019;mp;tirupati;parliment;fort;husband;tdp;ycp;partySun, 10 Jan 2021 03:00:00 GMTతిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించడంతో తిరుపతి స్థానానికి ఎన్నికలు అనివార్యమైనవి. ఇక 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో, అన్నీ పార్టీలు తిరుపతిలో పాగా వేయాలని చూస్తున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేనలు, ఇతర పార్టీలు తిరుపతి బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఎన్ని పార్టీలు బరిలో ఉన్న పోటీ మాత్రం వైసీపీ-టీడీపీల మధ్యే ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఇక్కడ గెలుపు కూడా సులువుగానే అంచనా వేయొచ్చు. అధికారంలో వైసీపీ ఇక్కడ ఈజీగా గెలుస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలో ఉండటం, సంక్షేమ పథకాలు ఆ పార్టీకి ప్లస్ పాయింట్లు. ఇక టీడీపీ ఇక్కడ సత్తా చాటాలని అనుకుంటుంది. కానీ తిరుపతిలో ఇప్పటివరకు టీడీపీ గెలిచింది. కేవలం ఒక్కసారే. అది 1984లోనే, ఆ తర్వాత నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీదే పైచేయి.

ఇక ఇప్పుడు తిరుపతి వైసీపీ కంచుకోట అయింది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ గెలిచింది. కాబట్టి తిరుపతిలో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే. కాకపోతే ఇక్కడ జగన్ టార్గెట్ అంతా మెజారిటీపైనే ఉందని తెలుస్తోంది. ఎంత మెజారిటీ వస్తే అంతమంది ప్రజల మద్ధతు జగన్‌కు దక్కినట్లు. ఇక్కడ వచ్చే మెజారిటీ పైనే జగన్ ఫోకస్ చేసి ముందుకెళుతున్నారు. పైగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో భారీ మెజారిటీనే రావోచ్చు.

కాకపోతే ఇక్కడున్న కొందరు ఎమ్మెల్యేలపై జనంలో వ్యతిరేకిత ఉంది. అది గనుక తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో కనిపిస్తే మెజారిటీ తగ్గుతుంది. అలా కాకుండా జనం జగన్‌ని చూసి ఓటు వేస్తే వైసీపీ మెజారిటీ లక్షల్లో ఉంటుంది. మరి చూడాలి తిరుపతి పార్లమెంట్‌లో వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుందో.




కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>