MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan4e6bd395-4d1b-4fd7-adec-d83a991cb7de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan4e6bd395-4d1b-4fd7-adec-d83a991cb7de-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయడం చాలకష్టమైన పని. దీనికితోడు పవన్ కు ఎలాంటి కథ నచ్చుతుంది ఎలాంటి కథ నచ్చదు అన్న విషయమై క్లారిటీ ఉండదు కాబట్టి పవన్ కు కథ చెప్పే విషయంలో దర్శకులు తడబాటుకు గురి అవుతారు.ఈ సంక్రాంతికి రాబోతున్న ‘అల్లుడు అదుర్స్’ మూవీని ప్రమోట్ చేస్తూ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. గతంలో తాను పవన్ ను కలిసి ‘తేరి’ తమిళ మూవీ కథ చెప్పి పవన్ ను ఆ కథ విషయమై ఒప్పించాలని చేసిన ప్రయత్నాలను గుర్తుకు చేసుకున్నాడు. pavankalyan;pawan;ravi;balakrishna;kalyan;santhosh;santosh srinivas;srinivas;tara;cinema;tamil;remake;agnyaathavaasi;u turn;santhossh jagarlapudi;adhursసంతోష్ శ్రీనివాస్ ను నిరాశ పరిచిన పవన్ రాజి కీయాలు !సంతోష్ శ్రీనివాస్ ను నిరాశ పరిచిన పవన్ రాజి కీయాలు !pavankalyan;pawan;ravi;balakrishna;kalyan;santhosh;santosh srinivas;srinivas;tara;cinema;tamil;remake;agnyaathavaasi;u turn;santhossh jagarlapudi;adhursSun, 10 Jan 2021 08:00:00 GMTపవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయడం చాలకష్టమైన పని. దీనికితోడు పవన్ కు ఎలాంటి కథ నచ్చుతుంది ఎలాంటి కథ నచ్చదు అన్న విషయమై క్లారిటీ ఉండదు కాబట్టి పవన్ కు కథ చెప్పే విషయంలో దర్శకులు తడబాటుకు గురి అవుతారు.


ఈ సంక్రాంతికి రాబోతున్న ‘అల్లుడు అదుర్స్’ మూవీని ప్రమోట్ చేస్తూ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. గతంలో తాను పవన్ ను కలిసి ‘తేరి’ తమిళ మూవీ కథ చెప్పి పవన్ ను ఆ కథ విషయమై ఒప్పించాలని చేసిన ప్రయత్నాలను గుర్తుకు చేసుకున్నాడు.


పవన్ కు ఆ కథ నచ్చడంతో అతడి సూచన మేరకు కథలో మార్పులు కూడ చేసి ఫైనల్ స్క్రిప్ట్ తయారు చేస్తే ఆ సమయానికి పవన్ తన ‘అజ్ఞాతవాసి’ మూవీని పూర్తి చేసుకుని రాజకీయాలలో బిజీ అయిపోయాడు అంటూ అప్పటి విషయాలను సంతోష్ ఇప్పుడు బయటపెట్టాడు.


తిరిగి సినిమాల వైపు పవన్ యూటర్న్ తీసుకున్నాక తాను మళ్ళీ ‘తేరి’ రీమేక్ స్క్రిప్ట్ విషయమై పవన్ ను కలవాలని ప్రయత్నించినా అతడి బిజీ వల్ల సాధ్యం కాలేదు అంటున్నాడు. మధ్యలో ఈ కథను రవితేజా తో తీద్దామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు అంటూ తాను కష్టపడి పూర్తి చేసిన ‘తేరి’ రిమేక్ స్క్రిప్ట్ తన వద్దనే ఖాళీగా ఉండి హీరోల కోసం ఎదురు చూస్తోంది అంటూ జోక్ చేసాడు. ప్రస్తుతం బాలకృష్ణ ను దృష్టిలో పెట్టుకుని ‘బలరామయ్య బరిలోకి దిగితే’ మూవీ కథను తయారుచేసిన విషయాన్ని వివరిస్తూ ఈ కథకు బాలయ్య ఏమంటాడో చూడాలి అంటు టాప్ హీరోల మూడ్స్ వల్ల దర్శకుల పడుతున్న బాధను పరోక్షంగా సంతోష్ శ్రీనివాస్ వివరించాడు. టాప్ హీరోల తిరస్కరణలో ఉన్న ఈ దర్శకుడు ‘అల్లుడు అదుర్స్’ పై పెట్టుకున్న ఆశలు ఎంతవరకు తీరుతాయో చూడాలి..





ఒకరిని కాపాడబోయి ఒకరు...విద్యుత్ షాక్ తో నలుగురి మృతి..

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>