PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-if-the-pcc-chief-gives-himf1720cb4-9e07-4e78-9747-f1992aba5e50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/what-if-the-pcc-chief-gives-himf1720cb4-9e07-4e78-9747-f1992aba5e50-415x250-IndiaHerald.jpgసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేస్తున్నాడు కాబట్టి టిపిసిసి ఎన్నిక ఆపాలని అధిష్టానానికి లేఖ రాయడం వల్లనే పిసిసి ఎన్నిక ఆగిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికలకు ముందే టిపిసిసి ఎన్నిక చేస్తే గ్రూపు రాజకీయాలు జరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుందని జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు అని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం ఉంది అని... టిఆర్ఎస్ పార్టీ హవా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ అభిమానులు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అని వ్యాఖ్యానించారు. తెలంగాcongress,ts;komatireddy rajgopal reddy;odisha;telangana;congress;mla;letter;janareddy;reddy;partyఅధిష్టానంపై ఎమ్మెల్యే ఫైర్... నన్ను పట్టించుకోవట్లేదని ఆవేదనఅధిష్టానంపై ఎమ్మెల్యే ఫైర్... నన్ను పట్టించుకోవట్లేదని ఆవేదనcongress,ts;komatireddy rajgopal reddy;odisha;telangana;congress;mla;letter;janareddy;reddy;partySun, 10 Jan 2021 17:44:09 GMTజానారెడ్డి  పోటీ చేస్తున్నాడు కాబట్టి టిపిసిసి ఎన్నిక ఆపాలని అధిష్టానానికి లేఖ రాయడం వల్లనే పిసిసి ఎన్నిక ఆగిపోయింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికలకు ముందే టిపిసిసి ఎన్నిక చేస్తే గ్రూపు రాజకీయాలు జరిగి ఇబ్బందులు పడాల్సి వస్తుందని జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు అని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం ఉంది అని... టిఆర్ఎస్ పార్టీ హవా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ అభిమానులు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఇచ్చిన తర్వాత నుండి ఇప్పటి టిపిసిసి ఎన్నిక కొరకు గాంధీభవన్లో చేసిన అభిప్రాయ సేకరణ వరకూ కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పిదం వల్లనే పార్టీ బలహీనపడుతుంది అని అన్నారు. ఉప ఎన్నికకు పిసిసి ఎన్నికకు ముడిపెట్టి వాయిదా వేయడం అంటే అధిష్టానం సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేదు అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరూ కూడా బాధపడవద్దు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, ప్రాణమిచ్చే వారున్నారు, కేవలం అధిష్టానం నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

నా లాంటి వ్యక్తి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తుంటే అధిష్టానం గుర్తించడం లేదు అని మండిపడ్డారు. ఒరిస్సా ఇతర రాష్ట్రాల నుండి  వచ్చిన వారికి తెలంగాణ రాజకీయాలు ఎలా తెలుస్తాయి అని ఆయన నిలదీశారు. నాలుగైదు సార్లు ఓడిపోయిన వాళ్ళని కనీసం డిపాజిట్లు రాని వాళ్ళని తెలంగాణలో తిప్పడం వలన  కాంగ్రెస్ పార్టీ ఎటు పోతుందో కాంగ్రెస్ అభిమానులు ఆలోచించాలని అని ఎమ్మెల్యే కోరారు. అలాగే పార్టీ కోసం కష్టపడే వాళ్లను అధిష్టానం గుర్తించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం లక్ష్యంగా ఆరోపణలు చేసారు.


షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>