PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhaskaran88c2021f-8c23-4aee-9ebd-2fccc94ec814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhaskaran88c2021f-8c23-4aee-9ebd-2fccc94ec814-415x250-IndiaHerald.jpg తమిళనాడుకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ భాస్కరన్‌ను కడప జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత కొంతకాలంగా భాస్కరన్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కొన్ని రోజులుగా తమిళనాడులో మకాం వేసిన పోలీసులు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు కడప పోలీసులు వెల్లడించారు.bhaskaran;koti;tiru;andhra pradesh;karnataka - bengaluru;district;kadapa;police;january;tamil;tamilnadu;arrest;news;internationalఎర్ర‌చంద‌నం పెద్ద‌ స్మగ్లర్‌ భాస్కరన్ అరెస్ట్‌..ఎర్ర‌చంద‌నం పెద్ద‌ స్మగ్లర్‌ భాస్కరన్ అరెస్ట్‌..bhaskaran;koti;tiru;andhra pradesh;karnataka - bengaluru;district;kadapa;police;january;tamil;tamilnadu;arrest;news;internationalSun, 10 Jan 2021 10:00:00 GMTఅంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ భాస్కరన్‌ను కడప జిల్లా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత కొంతకాలంగా భాస్కరన్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కొన్ని రోజులుగా తమిళనాడులో మకాం వేసిన పోలీసులు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు కడప పోలీసులు వెల్లడించారు. సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఓఎస్డీ దేవప్రసాద్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. భాస్కరన్ పై 2016 నుంచి అతడిపై 21 కేసులు నమోదయ్యాయి.  భాస్క‌ర‌న్ ఇచ్చిన సమాచారంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.


 నిందితుడి నుంచి తుపాకీ, బుల్లెట్లతోపాటు రూ.కోటి విలువైన 1.3 టన్నుల ఎర్రచందనం దుంగలు, 290 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. భాస్కరన్‌కు తమిళనాడులోని కొందరు రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  తన అనుచరుల చేత శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికించి తమిళనాడు, కర్ణాటక మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటాడు. ఇదిలా ఉండ‌గా ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక పెద్ద మ‌నుషుల హ‌స్తం ఉంద‌ని గ‌తంలోనే నిర్ధార‌ణ అయింది. అయితే రాజ‌కీయ నాయ‌కులు ఎస్కేప్ అవుతూ కేవ‌లం ముఠా స‌భ్యుల అరెస్ట్ మాత్ర‌మే జ‌రుగుతోంద‌న్న వాద‌న బ‌లంగా ఉంది. ఏపీ పోలీసులు ప‌లుమార్లు హెచ్చ‌రించినా ముఠాగాళ్లు ర‌వాణాను మానుకోక‌పోవ‌డంతో ఒక‌సారి ఎన్‌కౌంట‌ర్‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే.


అడ‌విలో చెట్ల‌ను గుర్తించ‌డం మొద‌లు  వాటిని నరికి విదేశాలకు ఎగుమతి చేసే వరకు వివిధ ద‌శ‌ల్లో ముఠా స‌భ్యులు ప‌నిచేస్తుంటారు. ఒక్కో దశ పనులను నిర్వహించడానికి ఒక్కో వర్గం ఉంటుంది. 2013 జనవరి ఫిబ్రవరిల్లో.. ఏపీ అటవీశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న కొంత మంది తమిళులను తొలిసారిగా ఏపీ అధికారులు గ‌గుర్తించారు. ఆత‌ర్వాత నుంచి గ‌ట్టి నిఘాను ఏర్పాటు చేసినా ర‌వాణా ఆగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.




దొండకాయ ద్వారా డయాబెటిస్ ను చెక్ పెట్టవచ్చా!

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>