MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swayangaa-thaamu-chesina-thappunu-oppukunna-star-herolu7405325b-b77d-41d8-9b63-79d3ac549f0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/swayangaa-thaamu-chesina-thappunu-oppukunna-star-herolu7405325b-b77d-41d8-9b63-79d3ac549f0e-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఇండస్ట్రీలో ఎంత హైప్ ఉంటుందో తెలిసిందే. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలు చేయడం కుదరదని చెప్పడం ఫ్యాన్స్‌కు శరాఘాతంలా తగిలింది. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆయన మళ్లీ సినిమాలు చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు రీ ఎంట్రీలో మంచి జోరుమీద ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. అయితే వీటిలో ఎక్కువగా రీమేక్ కథలే ఉన్న విషయం గమనించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. pawan;pawan;view;harish shankar;kushi;pawan kalyan;shankar;cinema;blockbuster hit;remake;hero;pinkఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!pawan;pawan;view;harish shankar;kushi;pawan kalyan;shankar;cinema;blockbuster hit;remake;hero;pinkSun, 10 Jan 2021 23:31:36 GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ఇండస్ట్రీలో ఎంత హైప్ ఉంటుందో తెలిసిందే. అలాంటి ఆయన రాజకీయాల్లోకి వెళ్లి, సినిమాలు చేయడం కుదరదని చెప్పడం ఫ్యాన్స్‌కు శరాఘాతంలా తగిలింది. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న ఆయన మళ్లీ సినిమాలు చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు రీ ఎంట్రీలో మంచి జోరుమీద ఉన్న హీరోల్లో ఆయన ఒకరు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. అయితే వీటిలో ఎక్కువగా రీమేక్ కథలే ఉన్న విషయం గమనించాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. స్ట్రెయిట్ సినిమాకి .. రీమేక్ కి మధ్య ఎంతో వైవిధ్యం ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. స్ట్రెయిట్ సినిమా టైం తీసుకుంటుంది. అలాగే పెట్టుబడి కూడా చాలా ఎక్కువ. ఫైనల్ గా ఔట్ పుట్ ఎలా ఉంటుందో ముందే ఊహించడం చాలా కష్టం. కానీ రీమేక్ అలా కాదు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమా స్క్రిప్టునే తీసుకుని ప్రాంతం - భాష - కల్చర్ కి అనుగుణంగా మార్పులు చేసుకుంటే సరి. అలాగే కథాచర్చల కోసం కూడా సమయం వృధా కాదు. తక్కువ సమయంలో మేకింగ్ పూర్తి చేసేయొచ్చు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాలకు శ్రమ తగ్గిపోతుంది. వీటన్నిటికీ మించి టైమ్ కలిసొస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో రీమేక్ లపై మన దర్శక, నిర్మాతలు, హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇటీవలి కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా రీమేక్ లపై ఎక్కువ ఆసక్తిగా ఉన్నారని అర్థం అయిపోతోంది. కెరీర్ ఆరంభంలో కొన్ని రీమేక్ లు చేసిన ఆయన.. ఇటీవల పింక్ రీమేక్ (వకీల్ సాబ్)తో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి రీమేక్ స్క్రిప్టులను లాక్ చేసేందుకు రెడీ అయిపోయారట. నెక్స్ట్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటించేందుకు పవన్ రెడీ అవుతున్నారు. అంతేకాదు.. దీంతో పాటు రీమేక్ స్క్రిప్టులపై వర్కవుట్ చేయాలపి తన దర్శకులకు సూచనలు చేస్తున్నారట పవన్. క్రిష్- హరీష్ శంకర్ సినిమాలను వెనక్కి నెట్టి ముందుగా రీమేక్ సినిమా చేయడానికి ఇదే కారణం అని సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలను పూర్తి చేయడానికి పవన్ అనుసరిస్తున్న వ్యూహం ఇది అని విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా తమ అభిమాన హీరో వరుసగా సినిమాలు చేయాలని అనుకోవడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.. కారణం ఆ అమ్మాయే?

అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>